Karate kalyani: మరో వివాదంలో కరాటే కల్యాణి

On

Karate kalyani: సినీ నటి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. కల్యాణి ఇంట్లో చైల్డ్ లేబర్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో ఉన్న కరాటే కల్యాణి ఇంట్లో ఈ సోదాలు జరిగాయి. కరాటే కల్యాణి పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో పాటు 2 నెలల పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అధికారులకు ఫిర్యాదులు అందాయి.నెలల వయస్సున్న పిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు కంప్లైంట్స్‌ రావడంతో విచారణ కోసం ఆమె […]

Karate kalyani: సినీ నటి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. కల్యాణి ఇంట్లో చైల్డ్ లేబర్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో ఉన్న కరాటే కల్యాణి ఇంట్లో ఈ సోదాలు జరిగాయి.

కరాటే కల్యాణి పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో పాటు 2 నెలల పిల్లలను కొనుగోలు చేసినట్లుగా అధికారులకు ఫిర్యాదులు అందాయి.నెలల వయస్సున్న పిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు కంప్లైంట్స్‌ రావడంతో విచారణ కోసం ఆమె ఇంటికి వచ్చినట్లు చైల్డ్ లేబర్ అధికారులు తెలిపారు. చైల్డ్ లేబర్‌ కమిటీ సభ్యులు సంతోష్, మహేశ్‌ ఆధ్వర్యంలో కరాటే కల్యాణి నివాసంపై సోదాలు జరిగాయి.

కరాటే కల్యాణి ఇంట్లో ఓ చిన్నారిని గుర్తించారు అధికారులు. ఆ చిన్నారి ఎవరు…ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా కరాటే కల్యాణి ఇంట్లో ఉంటున్న ఆమె తల్లి, సోదరుడిని అధికారులు ప్రశ్నించారు. ఓ దంపతులకు పుట్టిన మూడో ఆడబిడ్డను కల్యాణి పెంచుకుంటోందని ఆమె తల్లి విజయలక్ష్మీ వివరించారు. తెలిసిన వ్యక్తుల ద్వారా పాపను తెచ్చుకున్నామని చెప్పింది. పాపను న్యాయబద్దంగానే దత్తత తీసుకున్నట్లు కల్యాణి తల్లి స్పష్టం చేశారు. ఐతే చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందడంతోనే అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇటీవల యూట్యూబర్‌ శ్రీకాంత్ రెడ్డితో కరాటే కల్యాణి మధ్య వివాదం హాట్‌ టాపిక్‌గా మారింది. శ్రీకాంత్ రెడ్డి చేసే వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి…అతడి ఇంటికి వెళ్లి నిలదీసింది. ఇది ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఈ వివాదంపై ఇద్దరు ఎస్సార్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.