దీపావళి పండుగ 

దీపం ఐశ్వర్యం

On
దీపావళి పండుగ 

దీపావళి పండుగ 
దీపం ఐశ్వర్యం అని.. అంధకారం దరిద్రం అని.. దీపమున్నచోట జ్ఞాన సంపద ఉంటుందని దీపము సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీపావళిరోజు లక్ష్మీ దేవికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే.. సకల సంపదలు కలుగుతాయని పురాణాలు తెలిపాయి. సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం అనేది ఒక సంప్రదాయం. దీపకాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులగా చెప్తుంది శాస్త్రము.

దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా.. నీలకాంతి విష్ణు భగవానునిగా.. తెల్లని కాంతి పరమశివునికి ప్రతినిధులుగా చెపుతారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆశ్వయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రము రోజును దీపావళిగా చెప్తారు. పురాణాల ప్రకారం దీపావళి అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దీపావళికి సంబంధించి పురాణాల ప్రకారం నాలుగు కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.

శ్రీరామ చంద్రుడు.. సీతా దేవి
రావణాసురునితో జరిగిన యుద్ధంలో విజయము సాధించిన శ్రీరామచంద్రుడు.. సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేశాడు. ఆరోజు ఆశ్వయుజ మాసం, అమావాస్య అని రామాయణం చెప్తుంది. ఆరోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెప్తున్నాయి.

నరకాసురుని సంహరణ
నరకాసురుని సంహరించిన తరువాత.. నరకాసురుని పీడ వదిలిపోవడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఆ పరంపర నేటికి జరుగుతున్నదని పురాణాలు చెప్తున్నాయి.

Read More నేడే వరంగల్ రజతోత్సవ  సభను విజయవంతం చేద్దాం రండి కదలి రండి..


లక్ష్మీదేవి ఉద్భవించినరోజు..
దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రమును చిలుకుతుండగా.. లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆరోజును దీపావళిగా చెప్తారు. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని.. దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషంగా భావిస్తారు.

Read More ప్రజావాణికి 43 ఫిర్యాదులు.

అజ్ఞాతవాసం తర్వాత
మహాభారతంలో కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు. ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు. అలా పాండవులు తిరిగివచ్చిన రోజున దీపావళి పండుగగా చేస్తారు

Read More వివిధ కుల, మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

గుండెపుడి చైతన్య శర్మ 
ఫోన్ నెంబర్ 960 387 1143

Views: 112
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News