తెలుగుదేశం పార్టీ మద్దతు సిపిఐ సాంబశిరావుకు

సిపిఐదే గెలుపు

On

మా మద్దతు మీకే బడుగు బలహీనవర్గాల నాయకుడు కూనంనేని

సిపిఐదే గెలుపు

 

- మా మద్దతు మీకే.                             

- బడుగు బలహీన వర్గాల నాయకుడు కూనంనేని

Read More అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..

                                              

Read More ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

 భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో కోలకానినరేష్)నవంబర్ 17  : శుక్రవారం నాడు కొత్తగూడెం పట్టణంలో టిడిపి నాయకులు కనగాల అనంత రాములు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం, టీజేఎస్, ప్రజాపంథా బలపరుస్తున్న సిపిఐ నాయకుడు కూనంనేని సాంబశివరావుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మద్దతునిస్తుందని తెలిపారు. అనంతరం కూనంనేని సాంబశివరావు ను శాలువా, పూలమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెంలో 2009 నుండి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉండి అనేక అభివృద్ధి పథకాలు తీసుకువచ్చానని అన్నారు. కానీ ఎప్పుడో ఒకసారి కొత్తగూడెం పట్టణానికి టూరిస్టుల వస్తు జనాలకు కల్లబొల్లి మాటలు చెబుతున్న నాయకుడు అభివృద్ధి అంటే నేను నేనంటేనే అభివృద్ధి అంటూ మాయ మాటలు చెప్పుకుంటూ నియోజకవర్గంలో ప్రచారాన్ని సాగిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో కార్మికుల సమస్యల పట్ల వారికి అందవలసిన అభివృద్ధి పథకాల పట్ల అనునిత్యం పోరాటం సాగిస్తుంది సిపిఐ పార్టీ. పేద బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఎన్నో పోరాటాలు నిర్వహించి వారి అభివృద్ధికి నా నాయకత్వంలో బాటలు వేశాం. కొత్తగూడెంలో బైపాస్ రోడ్డు నిర్మాణంలో నా కృషి ఎనలేనిది. నా హయాంలోనే కేటీపీఎస్ ఏడవ దశ సైతం ప్రారంభమైంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా నేను తెచ్చిన నిధులను అభివృద్ధి పథకాలను మేము చేశామంటూ చెప్పుకోవడం దౌర్భాగ్యం. పూటకో పార్టీలు మారే మీరు అభివృద్ధికి తోడ్పాటు పడ్డారంటే సిగ్గుచేటుగా ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, అన్నింటినీ కలుపుకొని ఈ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన ఘనత సిపిఐ పార్టీకి ఉందన్నారు. బయ్యారం గనులను దోచుకుపోతుంటే అక్కడ జరిగిన కుంభకోణాన్ని ఆనాడు బయటపెట్టింది నేనేనని ఆయన తెలిపారు. నవంబర్ 30న జరుగనున్న ఎన్నికల్లో సిపిఐ పార్టీ అభ్యర్థిని నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు రత్నాకర్, టీజేఎస్ నాయకులు మల్లెల రామనాథం, కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, చింతలపూడి శేఖర్, సిపిఐ పార్టీ నాయకులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కొండా స్వామి, వేణు, ఆది బాబు, శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.

Read More అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..

Views: 130
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News