చేసిన పనులబట్టే ఫలితాలు.....!

రోజురోజుకు తగ్గుతున్న గ్రాఫ్.......? తమ వాళ్ళను తప్ప ఓటర్లను గుర్తించలే.....? గిరిజనుల నిధులతో లీడర్ల ఇంటికీ పథకాలు.....?

On
చేసిన పనులబట్టే ఫలితాలు.....!

న్యూస్ ఇండియా తెలుగు, సెప్టెంబర్ 19, 2023

పేటIMG-20231118-WA0397  రాజకీయం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది నమ్మినవారే నట్టేట ముంచటం ఆనవాయితీగా ముందడుగు వేస్తోంది. ఇస్టాను సారం సొంత నిర్ణయాలతో పార్టీకి తమ వారి వల్లే ఓటమివైపు అడుగులు వేయడం జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఇప్పటికే జిల్లా స్థాయి పొంగులేటి,మాజీ మంత్రి తుమ్మల ఎంట్రీతో తమ తమ వర్గ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మారింది కానీ అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆశవహులుగా ఉన్న పలువురు నాయకులు,వారితొ పాటు మాజీ ఎమ్మెల్యే తాటి ఒకరు కూడా, కాగా తాటికి కూడా కాంగ్రస్ లో చేదు అనుభవం ఎదురవ్వడం ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం,అప్పటికే బిఅరెస్ పార్టీలో ఏనాయకులతో అయితే ఇమడలేక బయటకు వచ్చి కాంగ్రస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారో,మళ్ళీ అదే నాయకులు వరుసగా కాంగ్రస్ పార్టీలో చేరడం ఇంకా అనేక కారణాలతో మళ్ళీ మాజీ ఎమ్మెల్యే కాంగ్రస్ కు బైబై చెప్పి గత సోమవారం ధమ్మపేటలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వధ సభలో కేసీఆర్ సమక్షంలో మరలా బిఆర్ఎస్ పార్టీలో లో చేరారు, దీంతో ఓటుబ్యాంక్ తరుమారైంది,ఎవరిని ఎన్నుకోవాలి ఎవరు ఏపార్టీకి సపోర్ట్ చేయాలో ఏ పార్టీని గెలిపించుకువలి అనే సందిగ్ధంలో నియోజక వర్గ ప్రజల్లో మిగిలిపోయింది ఎవరూ ఎప్పుడు ఏపార్టీలో వుంటారో అర్ధం కాని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంటుంది.

ఇప్పటికే తన గ్రాఫ్ పడిపోతుందని గమనించిన మెచ్ఛ,పలు వ్యూహ రచనలో నిమగ్నమైన,ప్రతికేయుల దగ్గరనుండి,చోట లీడర్లవరకు కొంతమేర గ్రౌండ్ వర్క్ ద్వారా జొజ్జరగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి,అందుకోసం కొందరు వ్యాపారులకు బాధ్యత అప్పగించారు,కానీ ఎవరికి వారు సొంత నిర్ణయాలతో మేచ్ఛకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటుచేస్తున్నారు,పత్రిక విలేకరుల మధ్య చిచ్చులు పెట్టడం చిన్న పెద్ద అనే చులకన భావం,వర్గ భేధాలతో విభజించి చూడడంతో కొందరు పాత్రికేయ మిత్రులు కూడా వీరి పట్ల కొంత అసంతృప్తిగానే వున్నారు, ఇందులో కూడా ఎవరు గెలిస్తే వాళ్లకు సపోర్ట్ చేసే విందంగా స్థానిక నాయకులు తీరు మేచ్ఛకు కొంత గ్రాఫ్ తగ్గుకుంటు పోతోంది.

ప్రజల్లో కూడా ఇప్పటికి అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ వారికే ప్రాధాన్యం ఇచ్చారని,మిగతా వారిని పక్కన పెట్టారు అనే భావం ఇంకా పోలేదు, అవి పథకాల రూపేణా,అవకాశాలు రూపేణా కాంట్రాక్టు ల రూపేణా అనేక కారణాలు సామాన్యులకు అవకాశం ఇవ్వలేదని, బిఆర్ఎస్ లో ఉండి ఎవరైతే పథకాలు అనుభవించారో  మళ్ళీ వాళ్లే పార్టీ మారారని ఇప్పటికైనా సామాన్యులను గుర్తుపెట్టుకోవలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు,అశ్వారావుపేట నియోజక వర్గ కేంద్రం మయిన అశ్వారావుపేట కు రావాల్సిన కోర్టు వగైరా ముఖ్యమైన కార్యాలయాలు ధమ్మపేటకు మార్చారని,ఒకరకంగా పేటను నామ మాత్రంగా వదిలేశారని,పేదలకు నిర్మించిన డబల్ ఫ్లాట్ బెడ్రూం ఇళ్ళు తొంభై శాతం నిర్మాణ ధశలోనే ఉన్నాయని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలక్షన్ సమయాల్లో మాత్రమే నియోజకవర్గంలో ఓటరు గుర్తుకొస్తారా లేదంటే ఓటర్లను గుర్తించర.నారాయణపురం పంచాయతీలో ఎలక్షన్ కోడ్ ఉల్లగించి మరి ఐటిడిఏ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు సైతం సుమారు ఐదు లక్షల రూపాయల తో మంజూరైన రోడ్డు బిఆర్ఎస్ లీడర్ తన ఒక్క ఇంటికే పొపించుకున్నారు,ఆ రకంగా గిరిజనుల నిధులు అగ్రకుల నాయకుల ఇంటి ముందు రోడ్డుగా మారాయని,ఇంకా ప్రజల్లో మార్పు రావాలని ఈసారి విభజించు పాలించు అనే వారిని కాకుండా కష్టపడి పనిచేసే వారిని అందరిని సమానంగా చూసే వారిని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ఓటరు తమ బాధను తెలియజేసారు,ఇవే కాకుండా ప్రభుత్వ కాంట్రాక్టు పనుల పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాగుల్లో ఉన్న జాతి సంపద ఇసుక తొడిపడేసారని,ఏజెన్సీ ఏరియా గిరిజనులు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.ఇలా అనేక కారణాలతో మేచ్ఛ గ్రాఫ్ తగ్గుముఖం పడుతూ పోతోంది.

Views: 30
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News