గోపరాజు పల్లి లో ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలు

ప్రజల సమస్యలు తీర్చే వారికే ఓటేస్తామన్న గ్రామస్తులు

On
గోపరాజు పల్లి లో ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలు

IMG-20231120-WA0521
గోపరాజుపల్లిలో సిపిఎం నాయకుల ప్రచారం

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండమండలంలోని గోపరాజుపల్లి గ్రామంలో రోజురోజుకు రాజకీయాలు తారుమారు అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎదురే లేదని చెప్పినా బిఆర్ఎస్, కాదు మేమే ముందున్నాం అంటూ చెప్పిన కాంగ్రెస్ సోమవారం నాటికి సిపిఎం పార్టీ రంగంలోకి దూసుకు రావడంతో త్రిముఖ పోటీ ఉండటం విశేషం. సోమవారం భువనగిరి నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి కొండమడుగు నరసింహ ప్రచారం గ్రామంలో జోరుగా సాగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ పేదల పక్షాన కొట్లాడేది ఒక సిపిఎం పార్టీ మాత్రమేనని అందుకే ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీ బలపరిచిన కొండమడుగు నరసింహ ఎమ్మెల్యే అభ్యర్థి సుత్తి కొడవలి సుక్క గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కొండమడుగు నరసింహ సిపిఎం మండల కార్యదర్శి సిరిపంగి స్వామి మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు మద్దెల రాజయ్య. గ్రామ శాఖ కార్యదర్శి ఎనుగుల నరసింహ తదితరులు పాల్గొన్నారు

Views: 161

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం    పోస్టల్ డిపార్ట్మెంట్ బిపిఎంలో ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ పాలసీల గురించి అవగాహన,  జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు...
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్