BSP పార్టీ లోకి పెరుగుతున్న చేరికలు
పటాన్చెరు నియోజకవర్గం
పటాన్చెరు నియోజకవర్గంలో BSP అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సమక్షంలో BRS శ్రేణులు BSP లోకి చేరారు.
BRS పార్టీ కి చెందిన కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్ దొంతి రాములు కుమారుడు దొంతి పెంటేష్ మరియు కార్యకర్తలకు నీలం మధు ముదిరాజ్ కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. BSP పటాన్చెరు MLA అభ్యర్థి నీళం మధు ముదిరాజ్ మాట్లాడుతు ప్రజలకు కావలిసింది డబ్బులు, స్కీములు కావని, ప్రజలకు కావలసినవి ఉచిత విద్య, ఉచిత వైద్యం అని అన్నారు. BSP పార్టీని మనం గెలిపించుకుంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం సాధ్యం అని అన్నారు. మరియు BSP గెలిస్తే ప్రజలు అందరు గెలిచినట్టే అని అన్నారు.
ఈ సందర్భంగా దొంతి పెంటేష్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం లో నీలం మధు ముదిరాజ్ గెలుపు ఖాయం అని , BSP అధికారం లోకి వస్తుంది కాబట్టి ప్రజలంతా నీలం మధు ముదిరాజ్ ఏనుగు గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీ తో నీళం మధు ముదిరాజ్ ని గెలిపించాలని కోరారు.
చేరిన వారిలో భాస్కర్,శ్రీకాంత్,పవన్, నర్సింగ్,సాయి,రాజు, శివ ప్రవీణ్,సుధాకర్,సూరి, సాయి రామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List