గులాబీ మయంగా గూడూరు కేంద్రం.

ప్రజల సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ పథకాలు.

On

మంత్రి సత్యవతి, రాథోడ్ శంకర్ నాయక్.

గూడూరు మండల కేంద్రంలో గులాబీమయం.

*మంగళహారతులతో బోనాలతో స్వాగతం పలికిన ప్రజలు.
* జోరుగా మండల కేంద్రంలో కలియ తిరుగుతూ ప్రజల ఆశీర్వాదాలు పొందిన శంకర్ నాయక్.
* మళ్లీ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి.
* మంత్రి సత్యవతి రాథోడ్, బానోత్ శంకర్ నాయక్.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి.వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం గులాబీ మయంగా మారిపోయింది మహబూబాబాద్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భాను శంకర్ నాయక్ మొదటగా గూడూరు మండల కేంద్రం చంద్రగుణంలో ప్రజలందరూ ఘనంగా మంగళహారతులతో బోనాలతో బతుకమ్మలతో స్వాగతం పలికి వాడ వాడ తిరుగుతూ చంద్రు గూడెం,గొల్లగూడెం, గూడూరు మండల కేంద్రంలో శంకర్ నాయక్ కు అశేష ఆదరణ లభించింది. ప్రతి కార్యకర్త జై తెలంగాణ జై టిఆర్ఎస్ జై శంకర్ అన్న నినాదం మంగళవారం మండల కేంద్రంలో ఒక్కసారిగా రూపొందింది. మండలంలోని గూడూరు, అయోధ్య పురం, పొనుగోడు, చిర్రకుంట తండా, రాములు తండా లలో పర్యటించిన శంకర్ నాయక్ కు చిన్న పెద్ద ముసలి ముతక అన్న తేడా లేకుండా ప్రజలు కార్యకర్తలు శంకర్ నాయక్ ప్రచార కార్యక్రమంలో పాల్గొని మళ్లీ కేసీఆర్ రావాలి శంకరన్న గెలవాలి. అన్న కోణంలో ప్రచార హోలీ అంగరంగ వైభవంగా జరిగింది. గులాబీ జెండాలతో గులాబీ టోపీలతో ఆడపడుచులు నౄత్యాలు చేసుకుంటూ ఆడపడుచులు ఆటపాటలతో సంతోషంగా ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి రైతుకు కష్టం వస్తే మొదటగా నేనున్నానని అంటూ, ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ కొడుతుంటే అక్కడికి వెళ్లి ఆపింది నేను కాదా అంటూ అని ఒక్కసారిగా ప్రజలందరికీ బిఆర్ఐ పార్టీపై నమ్మకం మరింత పెరిగేట్టుగా శంకర్ నాయక్ మాట్లాడారు. ప్రజల భవిష్యత్తు తనకు ముఖ్యమని కష్టసుఖాలలో  ఉంటానని ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన మహోన్నత నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రమే అని గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కి వెళ్లాలంటే 102 వాహనం ఏర్పాటు చేసి ఇంటి దగ్గరికి వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లి మళ్లీ ఇంటి దగ్గరే దింపే ఒకే ఒక్క ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్, చెప్పుకుంటూ పోతే ఒక రోజు పట్టదు అని గూడూరు మండల కేంద్రంలో సిహెచ్ సి ఆసుపత్రి కట్టడం నేనేనని బానోత్ శంకర్ నాయక్ అన్నారు. రైతుల కష్టాలు తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం రోజుకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పాటు పడుతుందని విద్యార్థులకు సన్న బియ్యం పౌష్టిక పరమైన ఆహారం అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలపై తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంపై ఇతర పార్టీ వాళ్లు కన్నేసారని వాళ్ళకి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వద్దని ఒక్క అవకాశం ఇవ్వాలి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 45 ఏళ్లు పాలించి తెలంగాణకు ఏం చేసిందని ప్రజా సమక్షంలో బానోతు శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ బాగు చేసి ఎస్సారెస్పీ ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తూ చెరువులన్నీ నింపిన కారకులు తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మనం ఎప్పుడూ రుణపడి ఉండాలని శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మండల కేంద్రం ఏజెన్సీ ఏరియా కాబట్టి పోడు భూములకు పట్టాలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని 20వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత ఒక బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని,వాగులకు చెక్ డాములు కట్టి రైతులకు నీటి వసతులు కల్పించిన ఒక బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కష్టాలు పట్టించుకుంటున్నదని ఇతర పార్టీ వాళ్లు బిజెపి కాంగ్రెస్ గెలిస్తే కమిషన్ల కోసమే వస్తున్నారని వాళ్లకు ఎన్నికలలో గట్టి బుద్ధి చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని భానోత్.శంకర్ నాయక్ అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ శంకర్ నాయక్ గెలుపు కోసం కార్యకర్తలు బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కష్టపడాలని కార్యక్రమంలో ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ 25వ తేదీన గూడూరు మండల కేంద్రంలో భారీ బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ జరుగుతుందని ఆ సభకు ప్రజలంతా ఏకమై రావాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి జిల్లా కోఆప్షన్ నెంబర్ ఎండి కాసిం గూడూరు మండల జడ్పిటిసి సుచిత్ర ఎంపీటీసీ నూకల రాధిక సురేందర్ మాజీ ఎంపిటిసి అయిలబోయిన సమ్మక్క గూడూరు మండల అధ్యక్షులు వేం వెంకటకృష్ణారెడ్డి టౌన్ అధ్యక్షులు చిదురు వెంకన్న సీనియర్ నాయకులు జలగం సంపత్ రావు వాంకూడోత్ కటార్ సింగ్ కో ఆప్షన్ మెంబర్ ఎండి రహీం బోడ ఎల్లయ్య పెసరి శివ నవీన్ ప్రవీణ్ సాగర్ జేరిపోతుల సాంబయ్య, నమిలి సాంబయ్య, పోలేపాక యాకయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Read More తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య..

Views: 5

About The Author

Post Comment

Comment List

Latest News

తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య.. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి.. మొగులయ్య..
కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్ని కూల్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.రాత్రికి రాత్రి కూల్చివేతలు ..కలెక్టర్, ఎమ్మార్వో ఇతర ప్రభుత్వ అధికారులు...
నూతన బస్సు సర్వీసు ప్రారంభం
తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ...
పులిగిల్ల నుండి ఉప్పల్ వరకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం
సింగరేణి లాభంలో 33% వాటా బోనస్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్
పహిల్వాన్ పూర్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు