సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి
రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల విజ్ఞప్తి
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను గెలిపించాలని *రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని,సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో పేద,బడుగు బలహీనవర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు ఉచిత రవాణా, 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితం,సన్నబియ్యం,సబ్సిడీపై గ్యాస్ పంపిణీ,రైతుల రుణాల మాఫీ,ఎకరానికి రూ,,12,000 రైతు భరోసా,సన్నధాన్యానికి క్వింటాకు రూ,, 500 బోనస్,తెల్ల రేషన్ కార్డుల పంపిణీ,ఆరోగ్యశ్రీ 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నది అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని దానికోసం సర్పంచ్,వార్డ్ సభ్యులు గా కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

Comment List