కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరావత్ నాగమణి
On
ఖమ్మం, డిసెంబర్ 11 — న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్* ) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో టిడిపి, జనసేన పార్టీ మద్దతుతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ధరావత్ నాగమణి పోటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని నాగమణి పేర్కొన్నారు. ముఖ్యంగా సిసి రోడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, పేదవారికి ఆర్థిక సహాయాలు వంటి పథకాలు గ్రామ ప్రజలకు ఉపయోగపడ్డాయని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించిన ఆమె, మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలవాలని ప్రజలను అభ్యర్థించారు.

Views: 6
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Dec 2025 14:35:25
ఖమ్మం డిసెంబర్ 11 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ...

Comment List