పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్య స్వాతి 96 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.సీపీఐ(ఎం),బీఆర్ఎస్ రెబల్ పార్టీ అభ్యర్థులపై గెలుపొందడం గమనార్హం.ఈ విజయం గ్రామ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానం తీసుకొచ్చింది.గెలుపు అనంతరం భూక్య స్వాతి మాట్లాడుతూ..తమపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అలాగే,గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని,కాంగ్రెస్ పార్టీ సర్పంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టంగా తెలిపారు.

About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List