మేడ్చల్ కు రానున్న భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్.

మేడ్చల్ ప్రజలు,బి.సి.వై పార్టీ కార్యకర్తలు,

By Venkat
On
మేడ్చల్ కు రానున్న భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్.

ఎమ్మెల్యే అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్

న్యూస్ ఇండియా తెలుగు:మేడ్చల్IMG-20231125-WA1673

మేడ్చల్ ప్రజలు,బి.సి.వై పార్టీ కార్యకర్తలు, రామచంద్ర యాదవ్ గారి అభిమానులు, లక్షలాదిగా తరలివచ్చి రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ ను విజయవంతం చేయండి.

ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్  పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్  మాట్లాడుతూ మేడ్చల్ ప్రజలందరికీ ఐ.టీ పార్క్ వెంకట్ గా నేను మీకందరికీ సుపరిచితున్నే గత పది సంవత్సరాల నుంచి విద్యావేత్తగా, సామాజిక ఉద్యమకారునిగా, సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ గా, అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్రమంతా ప్రజలను నిత్యం చైతన్యం చేస్తా ఉన్నాను. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్  సమాజం పట్ల నాకున్న బాధ్యతను గుర్తించి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించడం జరిగింది. మేడ్చల్ ప్రజలందరూ ఓట్లు వేసి నాకు ఎమ్మెల్యేగా సేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నానని అందులో భాగంగానే రేపు ఉదయం 9 గంటలకు మేడ్చల్ పట్టణంలో జరిగే బి.సి.వై పార్టీ రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని అనుక్షణం తపన పడుతూ అనేక కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజలను చైతన్యం చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్  పాల్గొంటున్నారు కాబట్టి మేడ్చల్ ప్రజలు బి.సి.వై పార్టీ కార్యకర్తలు మరియు రామచంద్ర యాదవ్  అభిమానులు లక్షలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో బి.సి.వై పార్టీ రాష్ట్ర నాయకులు అంజి యాదవ్, వెంకట్ కుమార్ ,సాయిముదిరాజ్, నితీష్ రెడ్డి,పాషా ,సరస్వతి పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 36
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.