నాడు.. చంద్రబాబు అలా ..నేడు ప్రజల కోసం జగన్ ఇలా!!
వాతావరణ ప్రతికూల అంశాలు అనేవి ఎవరూ ఊహించనవి. అంది వచ్చిన ఆధునిక టెక్నాలజీ ఎంత ఉన్నాగానీ, తుఫాను లాంటి సహజ సిద్ధమైన విపత్కర పరిస్థితులు ఏ ప్రాంత ప్రజలైనా ఎదుర్కోక తప్పదు. అలాంటి స్థితుల్లో ప్రజల్ని కాపుకాసేవాడే నిజమైన నాయకుడు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటికి రెప్పలా కనిపెట్టుకోగలిగే ధీరుడే అసలు సిసలైన ప్రజానాయకుడు.
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రాలోని సముద్ర తీర ప్రాంత ప్రజలు అల్లల్లాడుతున్న సమయంలో మన సీఎం వెన్నుకాచి చేపడుతున్న సహాయక చర్యలు ఆయనలోని సేవానిరతి, పాలనా సమర్థతకు కొలమానం. భారీ నష్టం జరిగేదాకా తుఫాను బాధితుల సమస్యల్ని ఇబ్బందుల్ని గాల్లో వదిలేయకుండా .. గ్రామ సచివాలయం, వాలంటీర్లు స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వరకూ.. తక్షణం ప్రజల్ని ఆదుకొనేలా చర్యలు చేపట్టేలా చేస్తున్న మన జగనన్న పనితీరు ఆయలోని పాలనా నిబద్ధతకు ఓ కొలమానం.
అదే చంద్రబాబు పరిపాలనలో 2014లో హుదూత్ తుఫాను ప్రభావంతో వైజాగ్ నగరం, పరిసర సముద్ర తీరప్రాంతాలు భారీగా నష్టపోయినప్పడు తక్షణ చర్యలు చేపట్టకపోగా, పబ్లిసిటీ కోసం, ప్రచారం కోసం బాబు చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. తన సొంత ప్రచారం లాభం కోసం బాబు చేసిన హడావుడికే పరిమితమైన నాటి ప్రభుత్వం యంత్రాంగం బాధితుల కష్టాలను తీర్చలేక పోయింది. బాబుగారి బూటకపు, నాటకపు ఎంట్రీతో తక్షణ చర్యల్ని చేపట్టలేకపోయింది. కేవలం బాబుగారి నిర్వాకం వల్ల వైజాగ భారీ నష్టం చవిచూసింది.
కానీ, మన సీఎం జగనన్నకు అలాంటి ప్రచారం అవసరంలేదు. తుఫాను ప్రాంతాల్లో పర్యటించి హడావుడి చేయకుండా.. ఉన్న చోట నుంచే తక్షణ సహాయక చర్యలు చేపెట్టేలా ప్రభత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తనదైన పాలనాధక్షత చాటుకుంటున్నారు. అందుకే, సీఎం జగన్ ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడయ్యారు
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List