భద్రాచలంలో బిజెపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 67 వర్ధంతి

On

పాల్గొన్న బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మ

బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి 

 

భద్రాచలం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) డిసెంబర్ 6 :డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్  67వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం మండల కమిటీ సభ్యులు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజా ధర్మ మాట్లాడుతూ ..మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే గొప్ప మేధావి అని, ప్రధానంగా కుల వివక్ష మీద, అంటరానితనంపై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయని, దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన అని కొనియాడారు.బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో పనిచేసిన ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నిడదవోలు నాగబాబు, మండల అధ్యక్షులు ములిశెట్టి రామ్మోహన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన వెంకన్న, మండల ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, కొంజర్ల ముక్తేశ్వరరావు, సూరత్ సుదర్శన్, అల్లాడి వెంకట సుబ్బారావు, సీనియర్ నాయకులు ఆవుల సుబ్బారావు, కనసాని శ్రీనివాస్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ములిశెట్టి నిఖిల్, యువమోర్చా మండల అధ్యక్షుడు అన్నం హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 39
Tags: breaking

About The Author

Post Comment

Comment List

Latest News

బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్...
జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను  కాపాడలంటూ అధికారుల‌కు ఆదేశం..
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!