కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
దళిత సంఘాల ఆధ్వర్యంలో
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన కంగ్టి లో దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధువారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదని అన్నారు . భారత రాజ్యాంగ శిల్పి, సంఘ సంస్కర్త మహా మేధావి అని కొనియాడారు.యువత రాజ్యాం గ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో,
నాయకులు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 274
Comment List