ఆడుదాం ఆంధ్ర కిట్లుపంపిణీ :ఎంపీపీ,జడ్పిటిసి,ఈఓఆర్టి

By Khasim
On
ఆడుదాం ఆంధ్ర కిట్లుపంపిణీ :ఎంపీపీ,జడ్పిటిసి,ఈఓఆర్టి

యర్రగొండపాలెం మండలంలోని అన్ని పంచాయతీలకు  శుక్రవారం ఆడుదాం ఆంధ్రా కిట్లను ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, జడ్పిటిసి చేదురి విజయభాస్కర్, ఈఓఆర్టి రాజశేఖర్ రెడ్డి, కన్వీనర్ ఓబుల్ రెడ్డిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ క్రీడల్లో పురుషులు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర  కార్యక్రమం క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన మెగా క్రీడోత్సవం ఆడుదాం ఆంధ్రలో క్రీడాభిమానులు తమ సత్తా చూపాలన్నారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. అందుబాటులో ఉన్న మైదానాలను ఎంపిక చేసి క్రీడలు నిర్వహించేం దుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాలు, వార్డుల నుంచి క్రీడాకారులు క్రీడోత్సవాలలో పాల్గొనేం దుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొలి ఐదు రోజులు గ్రామ స్థాయిలో, 12 రోజులు మండల స్థాయి లో, తర్వాత ఐదు రోజులు నియోజకవర్గ స్థాయిలో,ఏడు రోజులు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నా రు. క్రికెట్కు 16 మంది, బ్యాడ్మింటన్కు ఇద్దరు, కబడ్డీకి 12 మంది, వాలీబాలు 12 మంది, ఖోఖో జట్టుకు 15 మంది క్రీడాకారులు ఉండాలన్నారు. క్రీడల నిర్వహణకు అవసరమైన కిట్లు, ఇతర క్రీడా సామాగ్రిని ఇస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని సచివాలయాల సెక్రట రీలకు కిట్లు, క్రీడా సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యాలయంలో ఎంపీడీఓ నాగేశ్వర ప్రసాద్, సర్పంచ్ అరుణ బాయి, కన్వీనర్ సయ్యద్ జబీవుల, కో ఆప్షన్ నెంబర్ షాబీర్ భాష, ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మూడమంచు బాల గురవయ్య, నర్రెడ్డి వెంకటరెడ్డి, మైనార్టీ నాయకులు వలి, అచ్చయ్య, చెన్నకేశవులు,పంచాయతీల కార్యదర్శులు రామసుబ్బయ్య,రామారావు నాయక్, శివలింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.IMG-20231208-WA0562(4)

Views: 66
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.