ఆసరా పెన్షన్ దారులకు కార్డుల పంపిణీ

On

ఆసరా పెన్షన్ దారులకు కార్డుల పంపిణీ న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 29:( కొడకండ్ల రిపోర్టర్ గుర్రం ప్రభాకర్) జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధ్యేయం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి * తెలిపారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు […]

ఆసరా పెన్షన్ దారులకు కార్డుల పంపిణీ
న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 29:( కొడకండ్ల రిపోర్టర్ గుర్రం ప్రభాకర్)
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో
అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధ్యేయం
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని, సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి * తెలిపారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం మండలకేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో *ఎంపిపి ధరవత్ జ్యోతి రవీంద్ర గాంధీ నాయక్ అధ్వర్యంలో మండలంలోని 1292 పెన్షన్ దారులకు ఆసరా కార్డులు 21 గ్రామాల ప్రజాప్రతినిధులు&ప్రభుత్వం అధికారులకు అందజేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోనీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అద్యక్షుడు సిందే రామోజీ గారి అధ్వర్యంలో 07 మంది లబ్ధిదారులకు 2,82,500రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేశారు. ఈ సంధర్బంగా డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత, గీత తదితర వర్గాల వారికి పెన్షన్ లు అందిస్తున్న ఘనత సీఎం కేసిఆర్ గారిది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో పింఛన్ 600 రూపాయలు మాత్రమే.
సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు, నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామంటూ..
ఏ పైరవీ చేయకుండానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నారని ప్రభుత్వ సంక్షేమం అని ఆయన వివరించారు.

తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అని ఆయన పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో
,రాష్ట్ర Egs కౌన్సిల్ సభ్యులు అందే యాకయ్య,
మార్కెట్ చెర్మెన్ పేరం రాము, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, స్థానిక ఎంపీటీసీ కుందూరు విజయలక్ష్మి-అమరేoదర్ రెడ్డి, మండల కో ఆప్షన్ మేబర్ ఎండి నజీర్, ఎంపీటీసీ యాదమ్మ, వీరారెడ్డి లక్ష్మీదేవి నారాయణరెడ్డి,మండల పార్టీ ఉపాధ్యక్షుడు కీసర ఉమేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చెంచు రాజు రెడ్డి, బాకీ ప్రేమ్ కుమార్ వివిధ గ్రామాల ఎంపీటీసీలు,సర్పంచ్ లు ,ప్రభుత్వం అధికారులు,గ్రామపార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు దేవస్థానం డైరెక్టర్స్ , భాస్కర్ రెడ్డి,sc సెల్ అధ్యక్షుడు వల్లూరి రామస్వామి, మండల మహిళాఅధ్యక్షరాలు జేకుల విజయమ్మ, యూత్ అధ్యక్షుడు సతీష్ ,ఉప్పసర్పచ్ బోయిని రమేష్,వార్డుమేబర్ ఎండీ షెన్న, శోభన్, సతిష్ మరియు ముఖ్య నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు దితరులు పాల్గొన్నారు..

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా యువ జర్నలిస్టు యేసేబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా యువ జర్నలిస్టు యేసేబు పుట్టినరోజు వేడుకలు
యర్రగొండపాలెం యువ జర్నలిస్టు ఉప్పలపాటి యేసేబు పుట్టినరోజు వేడుకలు బుధవారం యర్రగొండపాలెంలో సహచర జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ యువ...
రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాం
ఏఈఓ ల మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి
హరిపిరాల గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన మాజీ సర్పంచ్ దంపతులు 
పచ్చిరొట్ట విత్తనాలను పక్కదారి.. నలుగురు వ్యవసాయ అధికారులు సస్పెండ్
ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి
జూన్ 9వ తేదిన జరుగనున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.