ఘనంగా దేవుని స్పర్శ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు..

On
ఘనంగా దేవుని స్పర్శ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు..

ఘనంగా దేవుని స్పర్శ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు..

IMG-20231225-WA0097
బ్రదర్. ఎపప్రా

అబ్దుల్లాపూర్మెట్, డిసెంబర్ 25 (న్యూస్ ఇండియా తెలుగు): పెద్ద అంబర్‌పేటలో దేవుని స్పర్శ మందిరములో ఎపఫ్రా మినిస్ట్రీస్  క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రదర్  ఎపఫ్రా మాట్లాడుతూ.. తోటి నగర వాసులకు క్రిస్మస్  శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు జననం సమస్త మానవాళికి దేవుడు అనుగ్రహించిన అత్యున్నత  బహుమానం. మనుష్యల జీవితాలను తన ప్రేమ, త్యాగంతో ప్రభావితం చేసి వారికి సమాధానాన్ని, సంతోషాన్ని ఆగ్రహించే దైవ కుమారుడు యేసయ్య.  మానవతా విలువలు పతనమైపోతున్న లోకంలో క్రీస్తు మార్గము ఒక గొప్ప ఆశాకిరణం లాంటిది అని అన్నారు. ఎవరి హృదయంలో ఆ వెలుగు ఉదయిస్తుందో వారు పరివర్తన చెంది శాంతి సమాధానంతో  పరోపకారులుగా జీవిస్తారు. యేసు నాధుని కనికరం తోటి ప్రజలందరూ అనుభవించాలని ఆశిస్తున్నాను. బ్రదర్ ఎపఫ్రా 1998 లో ఇద్దరికి క్రీస్తు ప్రేమను బోధించుట ప్రారంభించి, దైవచిత్తానుసారముగా 2004లో ఎపఫ్రా మినిస్ట్రీసు స్థాపించి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఆరాధనలు, సువార్త సభల ద్వారా అన్యులు, నామకార్థపు అనుభవములలో ఉన్నవారిని దేవుని రాజ్యము కొరకు సిద్ధ పరచుచున్నారు. క్రీస్తును గురించి బోధించుట మాత్రమే కాదు గాని, బోధించిన దాని ప్రకారం జీవించడం ద్వారా అనేకులను క్రీస్తు వైపునకు ఆకర్షించగలమని, ఈ భూమి మీద మనము జీవిస్తున్న ఒక్క జీవితమును ప్రభువుకు సమర్పించి, ఆదర్శప్రాయంగా జీవించమని ప్రోత్సహిస్తూ ఉంటారు. అనాధలను, విధవరాండ్రను, నిరాదరణకు గురైన వారిని వాక్యముతో దైర్యపరుస్తూ, ఆదరిస్తున్నారు. క్రీస్తు మనస్సును ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని బోధిస్తుంటారు. పరిచర్యలో ప్రకటిస్తున్న బోధలు సామాన్యమైనవారు అర్థం చేసుకునేవిగా, ఆచరించేవిగా, స్థిరమైనవిగా, మార్పులేనివిగా వున్నాయి. బాధ్యత కలిగి జయజీవితం జీవించాలనే తపన కలిగినవారు ఎపఫ్రా మినిస్ట్రీస్కు ముఖ్యులు. బంధుప్రీతికి, సమాజంలో వారికి ఉన్న స్థాయిని బట్టి ప్రాధాన్యత ఇవ్వక నిష్పక్షపాతమైన పరిచర్యగా ఎపఫ్రా మినిస్ట్రీస్ కొనసాగించబడుచున్నది.

Views: 25

About The Author

Post Comment

Comment List

Latest News