మా గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించండి సారూ...
ఎమ్మెల్యే కుంభం కు వినతి పత్రం అందించిన పులిగిల్ల గ్రామ మహిళలు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ గా పేరున్న పులిగిల్ల గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల కోసం ఎదురు చూసి వారి సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిని గమనించి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘపాక మధు, దయ్యాల శ్రీశైలం ల ఆధ్వర్యంలో పలువురు గ్రామ మహిళలు కలిసి భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే యాదగిరిగుట్ట డిపో మేనేజర్ తో మాట్లాడి సానుకూలంగా స్పందిస్తూ బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి పులిగిల్ల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల పోచమ్మ పద్మ, ఎల్లమ్మ సంఘపాక పుష్ప, సంఘపాక మాధవి, వేముల గీత, లక్ష్మి, గీత ,శోభ, పావని లావణ్య శిరీష తదితరులు పాల్గొన్నారు.
Comment List