కంగ్టి గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలి

On
కంగ్టి గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలి

సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి లో ఎస్సీ యూత్ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కు వినతిపత్రం ఇచ్చారు.  IMG-20240129-WA0072ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండల కేంద్రమైన కంగ్టి గ్రామానికి ఎస్సి రిజర్వేషన్ కేటాయించాలని అన్నారు.కంగ్టి గ్రామ పంచాయతీ ఏర్పడ్డ నుండి ఇప్పటివరకు గ్రామ పంచాయతీకి ఎస్సి సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించకపోవడం విచారకరమని అన్నారు.గ్రామంలో 2996 ఓటర్లు ఉన్నారని అందులో మెజారిటీ జనాభా 650 కి పైచిలుకు ఎస్సీల ఓట్లు ఉంటాయని అన్నారు. కావున దయచేసి వచ్చే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కంగ్టి గ్రామ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని అలాగే అవసరమైనన్ని వార్డు మెంబర్లకు కూడా జనాభా ప్రతిపదికన వార్డు మెంబర్ల సంఖ్య పెంచి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరారు.ఇప్పటికైనా నాయకులు అధికారులు చొరవ తీసుకొని గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ యూత్ అరుణ్, రాజు, సీమోన్, సచిన్, సందీప్, అజయ్, రాహుల్, పవన్, శ్రీమాన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Views: 413

About The Author

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.