రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

రాష్టంలో నంబర్ ప్లేట్లు మార్పు..!

On
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణ, న్యూస్ ఇండియా ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలు, ఆరు గ్యారెంటీల అమలు సహా పలు అంశాలపై చర్చించనుంది.

portfolios-of-telangana-new-ministers_b_0912231137

అయితే రాష్ట్రంలో వాహనాల నెంబర్ ప్లేట్స్ మార్చాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తతం వాహనాలకు TS అని ఉంది. దానిని TGగా మార్చాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడైనా TG అనే రాశారు. పలువురు తమ వాహనాలకు TG అని రాసుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక TG అనే ఉంటుందుని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ సర్కార్ TGని పక్కనబెట్టి TS (state of telangana)ను తెరపైకి తీసుకొచ్చింది. దీనిపై చాలా మంది పెదవి విరిచారు. అప్పటి నుంచే TG పెట్టాలనే డిమాండ్లు వినిపించాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరడంతో ఆ దిశగా అడుగుతు పడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా

Views: 470
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్