మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చాటిన కందుకూరి సోని...

By Ramesh
On
మూడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చాటిన కందుకూరి సోని...

IMG-20240219-WA1436

ప్రస్తుతం సివిల్ ఎస్ఐ గా ట్రైనింగ్ లో.... 

కానిస్టేబుల్ గా, గ్రూపు ఫోర్త్ ఫలితాలలో జూనియర్ అసిస్టెంట్ గా..... 

న్యూస్ ఇండియా తెలుగు, ఫిబ్రవరి 19 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

Read More కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా

ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉన్న ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడాలి..!. అలాంటిది.. ఉమ్మడి వరంగల్‌ ,  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన  కందుకూరి సోనీ గౌడ్..
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా  మూడు  ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ప్రశంశలు అందుకుంటుంది. గ్రామానికి చెందిన కందుకూరి బుచ్చమ్మ- శంకరయ్య దంపతుల చిన్న కుమార్తె సోనీ గౌడ్,నిరుపేద కుటుంబంలో పుట్టి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు తన సొంత గ్రామమైన కొన్నే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. పై చదువుల కోసం జిల్లా కేంద్రమైన జనగామలో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ, పూర్తి చేశారు. అనంతరం పై చదువుల కోసం వరంగల్ జిల్లా కేంద్రంలోని హనుమకొండ లో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జీనియస్ ( సీఈఓ రాము)ఎస్ ఐ,  కోచింగ్ సెంటర్లో, 2022, 2023 సంవత్సరంలో కోచింగ్  తీసుకున్నారు.  ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివి పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. అనంతరం సివిల్ ఎస్సై సాధించారు.ఆ రెండింటిలో ఎస్సై పోస్టు ఎంచుకున్నారు...
ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 ఫలితాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం  సివిల్  పోలీసు  సబ్ ఇన్స్పెక్టర్
హైదరాబాదులోని రాజేంద్రనగర్ శిక్షణలో ఉన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారక్క ,  జాతరలో విధులు నిర్వహిస్తున్నారు .  మూడు,  ఉద్యోగాలు సాధించిన  కందుకూరి సోనీ గౌడ్ ను ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, గ్రామస్థులతో పాటు, జిల్లా, మండల, గ్రామ, గీత కార్మిక నాయకులు, పలువురు గ్రామస్తులు అభినందించారు.

Views: 2405
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్