కాలుష్య కుంపటిగా డంపింగ్ యార్డు* *కరువైన నియంత్రణ
సంవత్సరాలు గడిచిన పట్టించుకోని మున్సిపల్, ఉన్నత అధికారులు*
మా పిల్లల ప్రాణాలు కాపాడండి అంటూ వేడుకుంటున్న తండావాసులు
*హచ్చు తండా ప్రజల ప్రాణాలతో చెలగాటం*
*మున్సిపల్ చెత్త బండ్లను అడ్డుకొని బయటయించిన తండ ప్రజలు*
*కాలుష్య కుంపటిగా డంపింగ్ యార్డు*
*కరువైన నియంత్రణ*
*డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు..*
*ఊరంతా పొగతో నిండిన వైనం..*
*సంవత్సరాలు గడిచిన పట్టించుకోని మున్సిపల్, ఉన్నత అధికారులు*
*శ్వాసకోస వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న తండవాసులు*
*భయబ్రాంతులకు గురి చేస్తున్న తొర్రూర్ మున్సిపల్ చైర్మన్& సానిటరీ ఇన్స్పెక్టర్*
*మా పిల్లల ప్రాణాలు కాపాడండి అంటూ వేడుకుంటున్న తండావాసులు*
*తొర్రూరు మున్సిపాలిటీలో ఘటన*
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డులో చెత్త కాలుతున్న మంటలను అదుపులోకి తీసుకొని వాయు కాలుష్యం లేకుండా చూడాల్సిన అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చేతులు దులిపేసుకుంటున్నారు. డంపింగ్ యార్డ్ కు ఆనుకొని ఉన్నటువంటి హచ్చు తండాలో లోని ప్రజలు ఒక నెల రోజులోనే 12 మంది శ్వాసకోస వ్యాధితో మరణించారు. హచ్చుతండలో నివసిస్తున్నటువంటి 200 కుటుంబాలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు అని తెలిపారు. ఈ డంపింగ్ యార్డ్ లో పడేసే వ్యర్ధాల వలన ఈ తండాలో విపరీతమైన ఈగలు, దోమలు, 24 గంటలు వ్యర్ధాలను కాల్చే పొగ ఈ తండను అనుకొని ఊపిరి ఆడక ప్రజలు రోగాల బారిన పడుతూ మరణిస్తున్నారు. దీంతో డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల గల తండాలు, కాలనీలు, గ్రామాలే కాకుండా యార్డు పక్కనుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికు ప్రమాదం పొంచి ఉన్నాయి. డంపింగ్ యార్డు కాలిపోవడంతో వెలువడుతున్న దుర్వాసన పొగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ కాలుష్యం వల్ల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలకు రోగాలు వచ్చి,ఇబ్బందులు ఎదురై,ప్రాణ నష్టం జరిగిన కూడా ఎవరు పట్టించుకోవడం లేదు అని స్థానికులు అన్నారు. బావిలోనినీరు కూడా కలుషితమవుతూ... నీళ్లపై తేమ ఏర్పడుతూ త్రాగడానికి మంచినీళ్లు కూడా తాగరాకుండా ఉన్నాయని తండావాసులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్యను ప్రశ్నించగా వివిధరకాల సమాధానం చెబుతూ హచ్చు తండా ప్రజలను బెదిరిస్తూ....భయభ్రాంతులకు గురి చేస్తూ నీ దిక్కున చోట చెప్పుకోమంటూ తండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. తొర్రూర్ మున్సిపాలిటీలో సస్పెండ్ అయినా శానిటరీ ఇన్స్పెక్టర్ కొమ్ము దేవేందర్ యధావిధిగా విధులు నిర్వహిస్తూ.... ...విలేకర్ ముసుగులో చలామణి అవుతూ... ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ... తొర్రూర్ పరిసర ప్రాంతంలోని పెట్రోల్ బంకులలో సదుపాయాలు కరెక్టుగా లేవని ఫోటోలు తీస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒక పెట్రోల్ బంక్ బాత్రూం విషయంలో పైనే ఇంత శ్రద్ధ వహించి డంపింగ్ యార్డ్ విషయంలో తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ అధికారులతో తో కుమ్మక్కై హచ్చు తండా ప్రజలను బెదిరిస్తూ.... ప్రశ్నించిన వారి ఇళ్లను కూల్చివేస్తామంటూ గిరిజన వాసులను దౌర్జన్యం చేస్తూ.. వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ తో ఇబ్బంది పడుతున్న తండావాసులను ఇంతవరకు జిల్లా అధికార యంత్రాంగం ఎవరూ కూడా పట్టించుకోవడంలేదని తండలో సుమారు 700 మంది ప్రజలు నివసిస్తున్నారని చిన్నపిల్లల కూడా ప్రాణహాని ఉందని అనారోగ్యాలతో ప్రతిరోజు ఆసుపత్రికి వెళుతున్నామని మమ్మల్ని మా పిల్లల్ని కాపాడండి అంటూ తండా ప్రజలు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మున్సిపల్,ఉన్నతాధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి తొలగించాలని మా ప్రాణాలు కాపాడాలనికోరారు. భయబ్రాంతులకు గురి చేసిన మున్సిపల్ చైర్మన్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ కొమ్ము దేవేందర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డుపై బైఠాయించిన తండవాసులు భానోత్ బాలు, బానోతు వీరన్న, బిక్షపతి, నునావత్ రమేష్, గుగులోత్ గణేష్, యాకన్న, రాజు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.
Comment List