ఘనంగా పార్వతి పరమేశ్వరుల 45వ వార్షిక కల్యాణమహోత్సవం..

ప్రత్యేక పూజలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

On
ఘనంగా పార్వతి పరమేశ్వరుల 45వ వార్షిక కల్యాణమహోత్సవం..

IMG-20240314-WA0183 ఘనంగా శ్రీ మహంకాళి అమ్మవారిి జాతర, పార్వతి పరమేశ్వరుల 45వ వార్షిక కల్యాణమహోత్సవం..

IMG-20240314-WA0191
ప్రత్యేక పూజలు పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మేట్, మార్చి 14 (న్యూస్ ఇండియా ప్రతినిధి): అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారమతిపేట్ గ్రామంలోని శ్రీ మాంకాళి అమ్మవారి దేవాలయంలో 45వ శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవనికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామి వారి కల్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలన్నారు. రానున్న రోజుల్లో దేవాలయాలకు ఎటువంటి సాయం కావాలన్నా నా వంతు సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జడ్పిటిసి బింగి దాస్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ఎంపిటిసి చేగూరి వెంకటేష్, మాజీ సర్పంచ్ మూల మహేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మూల ప్రవీణ్, తారామతిపేట్ గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Views: 143

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్