మినీ ట్యాంక్ బండ్ కళ ఇకనైనా నెరవేరేనా

ఆనకట్ట మత్తడి మరమ్మత్తులు ఎక్కడ....?.....పంటపొలాలకు పొంచి ఉన్న ప్రమాదం...?....10-15 రోజులలో పనులు మొదలుపెడతాం..?

మినీ ట్యాంక్ బండ్ కళ ఇకనైనా నెరవేరేనా

సునీల్ కుమార్ ఇరిగేషన్ డిఇ

IMG-20240517-WA0004

తెలంగాణ రాష్ట్రంలో సందర్శకులను ఆకర్షించేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా జలశయాలను సుందరంగా తీర్చిదిద్దాలని గత బియారెస్ ప్రభుత్వం నిర్ణయించింది.బిఆర్ఎస్ ప్రభుత్వం చెరువుకట్టలను మినీ ట్యాంక్ బాండ్ గా, తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినా పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన భారాస జిల్లాలోని మూడు పురపాలక సంఘాల్లో ప్రధానమైన చెరువుల వద్ద సుందరీకరణ పనులు చేయాలని తలచింది. హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ తరహాలో ప్రతి నియోజకవర్గంలోని ఒక చెరువులను మినీ ట్యాంక్బండ్గా రూపొందించేందుకు వివిధ శాఖల అధికారులతో గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.కానీ చెరువు కట్టలపై పచ్చదనం కనిపించేలా పచ్చని గడ్డిని పెంచడంతో పాటు, మినీగార్డెన్లో పరిమళాలు వెదజల్లే పూలమొక్కలు నాటి ప్రజలు ఆహ్లాదం పొందేలా చూడాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. కట్టకు రెండువైపులా వాకింగ్ ట్రాక్, వీధి దీపాలు, బెంచీలు వేసేందుకు 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు పురపాలక సంఘంలో మినీ ట్యాంక్లను మంజూరు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ పనులను పూర్తి చేయించడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన సుందరీకరణ పనులు మధ్యలోనే నిలిచిపోగా ప్రజల్లో నిరాశ నెలకొంది. తొర్రూరు పట్టణ పెద్ద చెరువుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మించేందుకు 2018-19లో రూ. 3.60 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధుల్లో చేయవలసిన పనులు కట్ట మరమ్మత్తులు, మత్తడి మరమ్మత్తులు, బతుకమ్మ ఘాట్, వంతెన నిర్మాణాలు, చేపట్టాల్సి ఉంది.కానీ రూ. 2.19 కోట్లతో వంతెన కోసం దిమ్మెల నిర్మాణం చేశారు. మిగిలిన పనులను గుత్తేదారుకు అప్పజెప్పడంతో అవి అక్కడే నిలిపివేశారు. అవి పూర్తి కావాలంటే అదనంగా నిధులు కావాలని రూ. 17.08 కోట్లు అంచనావేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఆ పనులకు ఆమోదం లభించకపోవడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.కాగా పూర్తైనపనులు కూడా నిరుపయోగంగా మారాయి.

పంటపొలాలకు పొంచివున్న ప్రమాదం
పెద్ద చెరువు కట్టకు గండిపడటంతో చెరువు కట్ట కింద ఉన్న 600 ఎకరాల పంట పొలాలకు ప్రమాదం పొంచిఉంది. ఇదంతా తెలిసిన అధికారులు మాత్రం ఏ ఒక్క పని ముందుకు సాగనివ్వడం లేదు.కానీ ఈ వానాకాలం కురిసే వర్షాలకు కచ్చితంగా పెద్ద చెరువు కట్ట గండి పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాదిలో అధిక వర్షాలు పడటం వలన చెరువు కట్ట గండి పడితే ఇసుక  బత్తలతో పూడ్చడం జరిగింది.కానీ అధిక వర్షాలు కురిస్తే ఆనకట్ట మాత్రం గండి పడుతుందని చెరువు కింద రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.


నిలిచిపోయిన సుందరీకరణ పనులు

Read More *దేశ వ్యాప్తంగా జూలై 1వ తేది నుండి అమలు కానున్న నూతన చట్టాలు.. *నూతన చట్టాలపై యస్.హెచ్.ఒ. లకు ఒక రోజు శిక్షణ తరగతులు.. *ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి, పూర్తి స్థాయిలో సిద్దంగా ఉండాలి..

మినీ ట్యాంక్ బండ్ నిర్మించే క్రమంలో తొర్రూర్ పెద్ద చెరువు కట్టపై ఇరువైపులా సుందరీకరణ చేపట్టడానికి సుమారుగా రెండు కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అట్టి పనులలో పెద్ద చెరువు కట్టపై ముళ్ళ చెట్లు తొలగింపు మాత్రమే చేసి మిగతా పనులు నిలిపివేశారు. కానీ అట్టి పనులు ఇంతవరకు ఒక్కటి కూడా ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సుందరీ కరణ పనులను కొనసాగించాలని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read More కాంగ్రెస్ విజయం

10-15 రోజులలో పనులు మొదలు పెడతాం
సునీల్ కుమార్ ఇరిగేషన్ డిఇ

Read More కొలతల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసి రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు

మినీ ట్యాంక్ బండ్ పనులు పది పదిహేను రోజులలో మొదలు పెడతాం. కాంట్రాక్టర్ కు రెండుసార్లు నోటీసులు పంపించాను అతను ఇంతవరకు స్పందించలేదు. కావున చివరగా నోటీస్ పంపించి కాంట్రాక్టర్ ను తొలగించే విధంగా ప్రతిపాదనలు చేస్తున్నాము. అదేవిధంగా తొర్రూర్ మున్సిపాలిటీ మినీ ట్యాంక్ బండ్ పనులను చేస్తామని కోరగా మేము వారికి ఎన్ఓసి పంపించాము. కానీ ఇంతవరకు మున్సిపాలిటీ నుండి ఎటువంటి సమాధానం రాకపోగా అట్టి పనుల గురించి స్పందించి త్వరలోనే పనులు మొదలుపెడతాం.

Views: 94
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళు నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళు
        నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్లు. లేబర్ కోడ్ ల రద్దుకై 23 మహ.బాద్ లో రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.    ఐఎఫ్ టియు
కాంగ్రెస్ విజయం
నీట్ పరీక్ష రద్దు చేయండి
రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
పదవులలో పాలకవర్గం
పదవులలో పాలకవర్గం బాధ్యతలు