మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని ఖండిస్తున్నాం
శ్రీనివాస్ మంగళ పెళ్లి తొర్రూర్ మండల జెడ్పిటిసి& మహబూబా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్
గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కొందరు దుష్ప్రచరం చేస్తున్నారు, ఆ వార్తను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది*
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలి, లేని పక్షంలో హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం తప్పితే స్వార్థపూరిత రాజకీయాల కోసం పార్టీ మారాల్సిన అవసరం దయాకర్ రావు గారికి లేదు.
ప్రజలు ,రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రజల తరుపున నిలబడి పోరాటం చేస్తాం , తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేస్తాం.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం దయాకర్ రావు గారు ముందుండి కొట్లాడుతారు, అపారమైన అనుభవం ఉన్న నాయకుడిగా అనేక పదవులను పొందారు, ఈ వయస్సులో పార్టీలు మారి అధికార దాహం కోసం వెంపర్లాడే నాయకుడు కాదు. ఇలాంటి దుష్ప్రచారాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ తప్పడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కోరుతున్నాం.
Comment List