మహేందర్ జ్ఞాపకార్థంగా సిమెంట్ కుర్చీలు
మండల కేంద్రంలో పలు చోట్ల
On
సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు.
మహేందర్ జ్ఞాపకార్థంగా సిమెంట్ కుర్చీలు.
*మండల కేంద్రంలో పలుచోట్ల.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
గత నెల క్రితం బైక్ ప్రమాదంలో మృతి చెందిన గోపగాని మహేందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా ఆయన కుటుంబ సభ్యులు భార్య కొడుకు కోడలు మనుమల్లు మనవరాలు కలిసి సిమెంటు కుర్చీలను స్థానిక ప్రజల కోసం ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలో పలుచోట్ల ఈ సిమెంట్ కుర్చీలను వేయించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఎదిగిన గొప్పగాని మహేందర్ గౌడ్ తన చేసిన సేవలు గుర్తు చేసుకుని పలు రాజకీయ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కంకటి.ముక్తేశ్వర్, ఎండి జావిద్, నల్లమాస కరుణాకర్,బోళ్లికొండ.శ్రీనివాస్, సంపంగి.రామచంద్రు, బత్తుల. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Read More ఘనంగా వివాహ పరిచయ వేదిక
Views: 614
Comment List