రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు

By Khasim
On
రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు

న్యూస్ ఇండియా హనుమంతునిపాడు:

రైతులు దగ్గర పరిమితికి మించి పండించినటువంటి అదనపు పొగాకును ప్రభుత్వం ఎలాంటి అదనపు సుంకం వసూలు చేయకుండా కొనుగోలు చేయాలని సిపిఎం హనుమంతునిపాడు మండల పార్టీ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కనిగిరి పొగాకు కొనుగోలు కేంద్రం పరిధిలో అనేక మంది రైతులు పొగాకు పంటలు సాగు చేశారని కాలం కలిసి రావడం సకాలంలో వర్షాలు పడటం వలన దిగుబడి అదనంగా వచ్చిందన్నారు పరిమితికి మించిన దిగుబడి రావటంతో పరిమితికి లోబడి మాత్రమే పొగాకు కొనుగోలు చేశారని మిగిలిన పొగాకు రైతులు దగ్గర మిగిలిపోయి ఉందన్నారు మిగిలి ఉన్నటువంటి అదనపు పొగాకును కూడా కొనుగోలు చేయాలని వేలం కేంద్రాల ద్వారా విక్రయాలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు అలా కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దళారులు ప్రవేశించి రైతులను మోసం చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కు ఎక్కువ ధరలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు అనేక సంవత్సరాల పాటు పొగాకు వేసి సరైన దిగుబడి రాక సరైన రంగు రాక ప్రకృతి వైపరీత్యాలకు లోనై నష్టాలు పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయని అలాంటి పరిస్థి నుంచి గత రెండు సంవత్సరాలు కాలంలో పొగాకు రైతులు బయటపడుతున్నారని తెలిపారు మార్కెట్లో ధరలతో పోలిస్తే పొగాకు విక్రయాలు రైతుకు సరసమైనటువంటి ధర ఈ ఒక సంవత్సరం మాత్రమే అది కొద్ది రోజులు మాత్రమే వచ్చిందన్నారు ప్రభుత్వం స్పందించి మిగిలి ఉన్నటువంటి పొగాకును కూడా సరైనటువంటి మార్కెట్ సౌకర్యం కల్పించి కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకున్నదవుతుందని విజ్ఞప్తి చేశారు ఉన్నత అధికారులు జ్యోక్యం చేసుకొని కనిగిరి పొగాకు బోర్డు పరిధిలో ఉన్న రైతులందరికీ ఈ వెసులుబాటు కల్పించాలని ఓ ప్రకటనలో తెలిపారు.IMG-20240621-WA1544

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన