తొర్రూరు పెద్ద చెరువులో.... భూ...భకాసురులు

చెరువు భూములు కాపాడాలి....... చెరువుకు సరిహద్దులు లేకపోవడం గమనార్హం 

తొర్రూరు పెద్ద చెరువులో.... భూ...భకాసురులు

తొర్రూరు పెద్ద చెరువులో భూభాకాసురులు

చెరువు భూములు కాపాడాలి.

చెరువుకు సరిహద్దులు లేకపోవడం గమనార్హం 

తొర్రూరు పెద్ద చెరువు ను డిజిటల్ సర్వే చేయాలి.*

*పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులను ప్రారంభించాలి.*

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి నిజాం కాలం నాటి పెద్ద చెరువును కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం (సి వై ఎస్ ఎస్), ఏఐఎఫ్డిఎస్ నాయకులు మాలోతు సురేష్ బాబు, అరుణ్ కుమార్ లు కోరారు. డివిజన్ కేంద్రంగా ఏర్పడినటువంటి తొర్రూరు ప్రాంతం దినదినంగా జనాభా పెరుగుతున్న కొద్ది చెరువు భూమి మీద కన్నేసి చెరువులో ఇండ్లను నిర్మించుకున్నారని, కొంతమంది  నాయకులు మున్సిపాలిటీ పాలక వర్గంలో రెండో పెద్ద లీడర్, కొంతమంది దళారులు చెరువు భూములను అమ్ముకొని కొనుక్కున్న వారు ఇండ్లు నిర్మించుకున్నారని అన్నారు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించి చెరువు భూములను కాపాడాలని వారి డిమాండ్ చేశారు.తొర్రూరు పెద్ద చెరువును డిజిటల్ సర్వే చేయించి చెరువు భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని వారు కోరారు. తక్షణమే ఎన్నికల హామీలు ఇచ్చిన తొర్రూరు పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తానన్న మాటను ఎమ్మెల్యే  పనులు ప్రారంభించాలని అన్నారు. తొర్రూరు పెద్ద చెరువును సుందరీకరణ చేసే విద్యార్థులకు పిల్లలకు వృద్ధులకు మీ ఉపయోగపడే విధంగా మార్చాలని వారు అన్నారు. 
ఈ కార్యక్రమంలో నాయకులు అఖీల్ ,బాలాజీ ,సందీప్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 525
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు  సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
డోర్నకల్ డిసెంబర్ 22 న్యూస్ ఇండియా ప్రతినిధి హైదరాబాద్, కొండాపూర్ మై హోమ్స్ మంగళలోని సోంత గృహాంలో తన 6వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న శ్రీ...
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి