మద్యం మత్తులో వ్యక్తి  హల్ చల్………వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని బెదిరింపులు

తొర్రూర్ ఎస్సై కూచిపూడి జగదీష్

మద్యం మత్తులో వ్యక్తి  హల్ చల్………వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని బెదిరింపులు

మద్యం మత్తులో వాటర్ ట్యాంక్ ఎక్కి దళిత బంధు రాలేదని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైకి ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన పప్పుల కుమార్ అనే వ్యక్తి మత్తుమందులో కిందకు దూకుతానని హల్చల్ చేశాడు. గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు దళిత బంధు ఇస్తానని హామీ ఇచ్చాడని, ఎర్రబెల్లి దయాకర్ రావు జిందాబాద్ అంటూ... ఇక్కడికి ఎర్రబెల్లి దయాకర్ రావు రావాలని నినాదాలు ఇస్తూ.... దూకుతానని బెదిరింపులు చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...పప్పుల కుమార్ గురువారం రోజున తొర్రూరు మండల చింతలపల్లి గ్రామానికి చెందిన కుమార్ అక్క, కమటం నరసమ్మ ఇంటికి వచ్చాడు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు మద్యం తాగి ఆ
మత్తులో తొర్రూరు పట్టణంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నాకు
దళిత బంధు ఇవ్వాలంటూ, ఎర్రబెల్లి ఇక్కడకి రావాలని
అంటూ నినాదాలు చేస్తూ దూకుతానని బెదిరింపులు
చేశాడు.సంఘటన స్థలంలోకి పోలీసులు, బంధువులు
వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా దూకే
ప్రయత్నం చేశాడు. చివరికి కుమార్ ను పోలీసులు,
స్థానికుల సహాయంతో కిందకి దించాడు. ఎస్సై జగదీష్
ను వివరణ కోరగా.. తగిన మత్తులో ట్యాంక్ ఎక్కి దళిత
బంధు కావాలని బెదిరింపులకు గురి చేశాడు. స్థానికుల
సహాయంతో కిందకి దింపి కౌన్సెలింగ్ ఇచ్చామని ఎస్సై
జగదీష్ తెలిపారు.

Views: 43
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు