అర్జునా… ఫల్గుణా..

పిడుగులు పడుతున్నప్పుడు ‘అర్జునా - ఫాల్గుణ’ అని ఎందుకు జపించాలి అసలు ఫాల్గుణ అనే నామానికి అర్థం ఏమిటి

On

న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక పెద్ద వంగర ప్రతినిధి 
గుండెపుడి చైతన్య శర్మ

పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో విరాట మహారాజు కొలువులో   పలురకాల వృత్తులలో ఉంటూ అక్కడే బసచేశారని మీకు తెలిసినదే.
              
అర్జునుడు విరాట మహారాజు కూతురికి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు. 

పాండవులు ఎక్కడ ఉన్నది తెలుసుకున్న కౌరవులు వారి అజ్ఞాతవాసాన్ని భంగం చేసేందుకు విరాటరాజు రాజ్యంపై దాడికి దిగుతారు.

అప్పుడు అర్జునుడు రాజకుమారుడైన ఉత్తరకుమారుడి రథానికి రథసారధిగా వ్యవహరిస్తాడు. 

Read More కెజిబివి గురుకుల పాఠశాలలో వంట ఏజెన్సీలకు శిక్షణ...!

అయితే కౌరవులు లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు. 

Read More పాత పింఛను పథకం సాధనే ధ్యేయం...

రాజకుమారుడికి    ధైర్యం  చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి శమీ వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకు రమ్మని చెబుతాడు.

Read More గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి నాగరాజు

అయితే భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు. నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు.

అర్జునుడికి కిరీటి, సవ్యసాచి, ఫాల్గుణ, పార్థ, విజయుడు ఇలా ఎన్నో నామాలు ఉంటాయి. 

ఒకదాని తరవాత ఒకటి, అర్జునుడు తన నామాల వెనక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు.

గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారని, ఎంతటి వీరుడినైనా ఓడించగల బలం ఉండడం వల్ల విజయుడు అంటారని,  దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరిటి అని అంటారని, కుంతీ దేవి అసలు పేరు పృథ, ఆమెకు జన్మించడం వలన పార్ధ అంటారని, ఇక ఉత్తర ఫల్గునీ నక్షత్రం మరియు పూర్వ పాల్గొని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల తనని ఫాల్గుణ అంటారని అర్జునుడు తన నామాలకు అర్ధాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడిని నమ్మిస్తాడు.

ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని, పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే పిడుగులు పడటం ఆగుతుందని, అలాగే ధైర్యం వస్తుందని పెద్దలు చెబుతారు.

సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు

Views: 14
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News