అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా పాలకుర్తి శ్రీ పోచమ్మ తల్లి ,అమ్మవార్ల బోనాల పండుగ

అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బహిష్యవాణి

By Venkat
On
అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా పాలకుర్తి శ్రీ పోచమ్మ తల్లి ,అమ్మవార్ల బోనాల పండుగ

భవిష్యవాణి (రంగం )వినిపించిన జోగిని భవాని

పోచమ్మ కాలనీలోని శ్రీ పోచమ్మ అమ్మవారికి ఎస్సీ కాలనీలోని శ్రీ పోచమ్మ అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తజన సందోహం

 

Read More లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం అంటే...! ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి...!!

 

శరణం శరణం పోచమ్మ తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

 

పాలకుర్తి మండల కేంద్రంలోని అతి మహిమగల మహిమాన్వితమైన శక్తి గల కోరిన కోర్కెలు తీర్చే భక్తుల పాలిటి కొంగు బంగారంలా ఆదిపరాశక్తి గ్రామ దేవత అయినటువంటి శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ విద్యుత్ కాంతులతో, చలువ పందిళ్లతో, తీరక్క పువ్వుల అలంకరణతో బోనాల పండగ పోతురాజుల నృత్యాలతో, శివసత్తుల పూనకాలతో, బైండ్ల రాజుల విన్యాసాలతో, తెల్లవారుజాము నుండి భక్తులు ఆడపడుచులు బోనంకుండలో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొని అమ్మా మా పిల్లాపాపల్ని పాడిపంటలని గ్రామాన్ని చల్లంగా చూడు అని వేడుకొని వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా పండగ నిర్వహించుకుంటామని వేడుకున్నారు.

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

*భవిష్యవాణి (రంగం )వినిపించిన జోగిని భవాని

భవిష్యవాణిలో జోగిని భవాని మాట్లాడుతూ ఈసారి పండగ అంగరంగ వైభవంగా నిర్వహించారని గ్రామాన్ని పిల్లాపాపల్ని ప్రజలను పాడిపంటలను ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని దీవించి ఈసారి వర్షాలు కూడా సకాలంలో కురుస్తాయని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సుఖసంపదలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉంటారని చల్లని దీవెన ఇచ్చారు.గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి బోనాల పండగ సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు కలవకుండా తాగునీటి సౌకర్యం చలువ పందిళ్లు తీరక్క పువ్వుల అలంకరణతో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర చారి శ్రమించ గా ,అలాగే విద్యుత్ శాఖ వారు నిరంతర విద్యుత్ అందించగా, ఇలాంటి అమాచార్య సంఘటనలు జరగకుండా పాలకుర్తి ఎస్ఐ సాయి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును అడుగడుగునా ఏర్పాటు చేశారు.ఈ బోనాల పండగ సందర్భంగా మండల కేంద్రంలోని అన్ని పార్టీల వారు,కుల పెద్ద మనుషులు,యువతీ యువకులు సహాయ సహకారాలు అందింIMG_20240815_065149చారు.

Views: 16
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News