8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి బిజెపి సభ్యత్వం పొందండి

బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు

On

IMG20240911134306భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్ ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. కొత్తగూడెం పట్టణంలోని ఓల్డ్ డిపో నుంచి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వరకు బిజెపి కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం  జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమంనీ బిజెపి పార్టీ IMG20240911142814 నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 200 సభ్యత్వాలు నమోదు అయ్యేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు . వెయ్యి సభ్యత్వాలు చేసిన కార్యకర్తకు జె.పి నడ్డా,అమిత్ షా తో సన్మానింప జరిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యత్వ నమోదు కమిటీ ప్రభారి శ్రీవర్ధన్ రెడ్డి , సహప్రభరి రాజేష్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన్న సీతారామరాజు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు కొదమసింహం పాండురంగచార్యులు, ముసుకు శ్రీనివాస్ రెడ్డి, ఐలయ్య, వెంకటేశ్వర్లు, ముసలయ్య, నిర్మల, కుంజ ధర్మ, రవీందర్, బాలు నాయక్, రామ్ రెడ్డి, విజయలక్ష్మి, బాలరాజు, గొడుగు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 59
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News