డబ్బులిస్తేనే రేషన్ షాపులు, ఫీల్డ్ అసిస్టెంట్ పదవులు - మండలంలో టాక్...!

-పార్టీని నమ్ముకున్న పాత వారిని గుర్తించడంలో నాయకులు విఫలం.

On
డబ్బులిస్తేనే రేషన్ షాపులు, ఫీల్డ్ అసిస్టెంట్ పదవులు - మండలంలో టాక్...!

- నేతల ఒత్తిడితో తలలు పట్టుకుంటున్న అధికారులు.

న్యూస్ ఇండియా ప్రతినిధి/పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 11 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటిదాకా కష్టపడిన కార్యకర్తలకు తగిన ఫలితాలు అందలేదని నియోజకవర్గంలోని ప్రతి మండలంలో జోరుగా వినిపిస్తున్న మాటలివి. అలాగే చాలా కాలం నుండి పార్టీని నమ్ముకుని, పార్టీ గెలుపు కోసం స్వయంగా తమ చేతి నుండి డబ్బులు ఖర్చుపెట్టినప్పటికీ తమకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని మండలంలో పలువురు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జీ మరియు మండలం ఇంచార్జీలు చెప్పిన విదంగా రేషన్ డీలర్ షాపులు , ఫీల్డ్ అసిస్టెంట్ పదవులు నియోజకర్గంలో ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ వర్గీయులు చెప్పిన వారికి మాత్రమే ఈ పదవులు దక్కుతున్నాయని మండలంలో అదే పార్టీకి సంభందించిన కొంతమంది ద్వారా విమర్శలు గట్టిగానే వినిపిసస్తున్నాయి. నియోజకవర్గం మరియు మండల స్థాయిలో మేము చెప్పిన వ్యక్తులకు పదవులు ఇవ్వాలని అధికారులకు భారీగానే ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే పార్టీలోనే మరో వర్గం కూడా తమకు సంబందించిన వ్యక్తులకు పదవులు ఇవ్వాలని పట్టుపట్టడంతో, ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే అదునుగా చేసుకొని మండలంలో రేషన్ డీలర్ గాని ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కావాలంటే పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేస్తున్నట్లు అక్కడక్కడా టాక్ నడుస్తుంది. కానీ చాలా సంవత్సరాలనుండి కష్టమైన నష్టమైన ఒకే పార్టీ కోసం పనిచేస్తూ ఎదోఒకరోజు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించకపోతారా అందుకు తగిన ప్రతిఫలం దక్కకపోదా అంటూ ఎదురు చూస్తున్న కొంత మంది ఆశలు నిరుగారినట్లయింది. తెలుగుదేశం పార్టీని గెలుపించుకోవడానికి గతంలోనైతేనేమి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అహర్నిశలు కస్టపడి పనిచేసిన ఫలితం లేకుండపోయింది. అంతేనేమో పార్టీ కొరకు ఎంత పనిచేసిన వారికి చివరికి మొండిచేయి చూపించడం అంటే ఇదేనేమో అని మండలంలో పలువురు మాట్లాడుకోవడం విశేషం....IMG-20240911-WA0239

Views: 142
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"
'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.