చికిత్స పొందుతున్న దళిత మహిళ గోవిందమ్మను పరామర్శించిన- దళిత నాయకులు...

- దళితులపై జరుతున్న దాడులను అరికట్టాలి.

On
చికిత్స పొందుతున్న దళిత మహిళ గోవిందమ్మను పరామర్శించిన- దళిత నాయకులు...

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 14 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో గురువారం రోజు రాత్రి సమయంలో దళిత మహిళపై మరో సామాజిక వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆరు నెలల క్రితం దళిత మహిళ గోవిందమ్మ కుమారుడు ఈరన్న మరియు అదే గ్రామంలో రజక సామాజిక వర్గానికి చెందిన చాకలి నాగలమ్మ అను ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరోజు నుండి రెండు కుటుంబాల మధ్య తీవ్ర మనస్పర్దాలు, గొడవలు ఏర్పడి యువతీ నాగలమ్మ కుటుంబ సభ్యులు కలిసి యువకుడు తల్లి గోవిందమ్మను కరెంట్ పోల్ కి కట్టి దారుణంగా చితకబాదారు.వెంటనే స్పందించిన పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని దళిత మహిళ గోవిందమ్మను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవిందమ్మను శనివారం పెద్దకడుబూరు మండలంలోని వైసీపీ ఎస్సిసెల్ నాయకులు ముక్కరన్నా , అర్లప్ప మరియు ఎమ్మార్పిఎస్ నాయకులు యువరాజు ఆమెను పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ దళిత మహిళపై ఇంతటి దాష్టికానికి పాల్పడిన అగ్రవర్ణాల నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై విచక్షణారహితంగా జరిగిన దాడి ఘటనపై వారు మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న అగ్రవర్ణాల దాడులను అరికట్టాలని అధికారులను కోరారు.IMG_20240915_061202

Views: 71
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.