పొంగులేటి పై ఈడీ దాడులను ఖండిస్తున్నాం

బిజెపి కనుసందనలోనె దాడులు

On

కొత్తగూడెం క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం

IMG20240928123817కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 28: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఆయన  కుటుంబంపై ఈడి దాడులను పూర్తిగా ఖండిస్తూ కొత్తగూడెం పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తూన కాంగ్రెస్ ప్రభుత్వ 9 నెలల పాలనను జీర్ణించుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఈడి దాడులు చేపిస్తుందని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో జరుగన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి 14 సంవత్సరాలుగా ఈడిని కక్ష పూరితంగా ఉసిగొల్పుతుంది అన్నారు. 25 సంవత్సరాలుగా ప్రముఖ కాంట్రాక్టర్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకులు తుమూ చౌదరి, నాగేంద్ర త్రివేది, మేరెడ్డి జనార్దన్ రెడ్డి,మండే వీర హనుమంతరావు, తోట దేవి ప్రసన్న, పీతాంబరం,చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 205
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి