పొంగులేటి పై ఈడి దాడులు బిజెపి బిఆర్ఎస్ లోపాయి కార ఒప్పందమే

ఈడీలతో కాంగ్రెస్ ను భయపెట్టలేరు

On

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

IMG20240928163259కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) సెప్టెంబర్ 28: ఈడీలతో కాంగ్రెస్ ను భయపెట్టలేరని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డ లోని వారి  నివాసంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై బిజెపి బిఆర్ఎస్ లోపాయి కారి ఒప్పందముతో జరిగిన ఈడి దాడులు రాజకీయ కక్ష సాధింపు అని అన్నారు. మంచి రాజకీయ భవిష్యత్తు , ప్రజల నాయకుడైన పొంగులేటి ఆదరణను ఓర్వలేకనే ఈడి దాడులు జరుగుతున్నాయి అన్నారు. పొంగులేటి కుమారుడు మరియు బంధువుల ఇండ్లపై 16 చోట్ల ఏకకాలంలో దాడు జరిపారని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందని, రాబోయే రోజుల్లో కచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ చంద్రశేఖర రావు , కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, కూచిపూడి జగన్, మాలోత్ కృష్ణ, అర్జున్ రావు, వెంకటరెడ్డి, ధర్మారావు, బలరాం, అరుణ్, పూణెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

.

 

Views: 508
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన