చిన్నతుంబళం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ....!
చిన్నతుంబళంలో దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు.
- ఘటనలో 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.
న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 30 :- పెద్దకడుబూరు మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సోమవారం ఉదయం బోయ తాయన్న అతని కొడుకు బోయ నాయుడు తో పాటు వారి కుటుంబ సభ్యులు కొందరు కలిసి అదే గ్రామానికి చెందిన కమ్మరి వీరేష్, గంగాదర్ మరియు అతని తండ్రి బుడ్డప్ప ను కట్టెల తో కొట్టి కిందపడేసి కాళ్లతోను చేతులతోను కొట్టి దాడి చేసి రక్త గాయాలు చేశారాని దాడికి గురైన కమ్మరి వీరేష్ సోమవారం మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దాడి ఘటనపై ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి బోయ తాయన్న కొడుకు బోయ నాయుడు అదే గ్రామానికి చెందిన కామవరం గంగాధర్ కు ఆటోను తగిలించడంతో ఇరు వర్గాల కుటుంబాల మధ్య వాదులాటతో గొడవలు చేసుకున్నారని తెలిపారు. అక్కడితో ఆగకుండా సోమవారం ఉదయం బోయ తాయన్న అతని కొడుకు బోయ నాయుడు తో పాటు వారి కుటుంబ సభ్యులు 14మంది కలిసి గంగాదర్, అతని తండ్రి బుడ్డప్ప మరియు వీరికి సపోర్ట్ గా ఉన్నాడని కమ్మరి వీరేష్ ను కట్టెలతో కొట్టి రక్త గాయాలు చేసి బెదిరించారని, అలాగే గంగాదర్ బంధువైన రమేష్ యొక్క ఇంటి తలుపులు పగలగొట్టారని దాడికి గురైన కమ్మరి వీరేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ దాడి ఘటనపై విచారణలో దాడికి పాల్పడిన మొత్తం 14మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్వెఐ ల్లడించారు. దాడి ఘటనలో గాయాలైన వ్యక్తులను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
Comment List