విజయానికి ప్రతీకగా విజయదశమి

పులిగిల్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

On
విజయానికి ప్రతీకగా విజయదశమి

 

శని పై సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారని పులిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి అన్నారు. అనంతరం ప్రతి ఏటా నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు ఈ IMG-20241012-WA0897 సందర్భంగా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని,పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖసంతోషాలతో నిత్యం విజయాలు అందు కోవాలని, ఆకాంక్షించారు. దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకేచోట చేరి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్‌ బలాయ్‌ తీసుకోవడం పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం.. శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకో వడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని గుర్తు చేశారు. హిందువులు జరుపుకునే పండుగల్లో దసరా పండుగ అతి పెద్దదని,ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని గ్రామపంచాయతీ దగ్గర్లోని గడి మైసమ్మ అమ్మవారిని ప్రార్థించారు. ఈ జెండా కార్యక్రమంలో పులిగిల్ల గ్రామ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 106

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..