కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

 

మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, బల్పాల గ్రామంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్ వాడి కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లను ఆకస్మిక తనిఖీ చేశారు, 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా సెలవులు ముగిసినందున విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలలకు, హాస్టళ్లకు వస్తున్న క్రమంలో తరగతి గదులు, హాస్టల్ రూమ్స్, డైనింగ్ హాల్స్, స్టడీ రూమ్స్,  మరుగు దొడ్లు, త్రాగు నీరు, విద్యుత్, తదితర అన్ని  సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలనీ వార్డెన్లు, ప్రిన్సిపల్ లను ఆదేశించారు,

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని, ఇన్ పేషంట్స్, ఔట్ పేషెంట్స్, వివరాలు సేకరించి జ్వరం సర్వే నిర్వహించాలని, గ్రామ స్థాయిలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం లు ఇంటింటి సర్వే నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు, 

Read More సీజ్ ద షాప్

అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు,శ్యామ్, మ్యామ్,వారికి పౌష్టిక ఆహారం అందించాలని, విలేజ్ హెల్త్ ప్రోగ్రాం నిర్వహించి, గ్రామాల్లో ఆరోగ్యం, పరిశుభ్రత, పరిరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు, 

Read More అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..

గ్రామాల ప్రత్యేక అధికారులు ప్రతీ రోజు పాఠశాలలు, వసతి గృహాలు తనిఖీలు నిర్వహించాలని, విద్య, వైద్యం, సానిటేషన్, ఆరోగ్యం తదితర సౌకర్యాలపై ప్రతిరోజు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు, IMG_20241016_095021

Read More అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..

Views: 72
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News