బంగారం చోరీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

కేసుకు కీలకంగా మారిన సీసీ పుటేజులు

On
బంగారం చోరీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

5 తులాల బంగారం ,3సెల్ ఫోన్లు,28000 నగదు రికవరీ వివరాలు వెల్లడించిన డిఎస్పి

చుంచుపల్లి (న్యూస్ ఇండియానరేష్) 22: బంగారు చోరీ కేసులో నలుగురు నిందితులను చుంచుపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా బంగారం చోరీ కేసును చాకచక్యంగా చేదించినట్లు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పి వివరాలు తెలుపుతూ.. అక్టోబర్ 9 వ తారీఖున రైటర్ బస్తీకి చెందిన వెంకటేశ్వర్లు అనే రిటైర్డ్ ఎంప్లాయ్ దసరా పండుగ సందర్భంగా బ్యాంకు లాకర్ లో ఉన్న 19 తులాల బంగారాన్ని విడుదల చేసుకున్నాడు. అనంతరం దారిలోని విద్యానగర్ కాలనీలోని ఆర్కే సూపర్ మార్కెట్ వద్ద కారు ఆపి కిరాణా సామాన్ తీసుకొని వచ్చి వెనుక వైపు డిక్కీ ఓపెన్ చేసి కిరాణా సామాన్లు పెడుతుండగా అదే అదునుగా భావించిన తంబాల నితిష్, మరో ముగ్గురు సహాయంతో ఆటోలో వచ్చి, కారు డోర్ ఓపెన్ చేసి కార్ లో ఉన్న బంగారాన్ని అపరించుకొని అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం కారులో బంగారం చోరీకి గురిందని గమనించిన వెంకటేశ్వర్లు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.రంగంలో దిగిన పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి, వారి కదలికల పై నిఘా ఉంచి చాకచక్యంగా మంగళవారం అరెస్టు చేశారు .తంబాల నితిన్ తో పాటు నిమ్మల వినయ్, గుంజి వీరబాబు, మహమ్మద్ నయీమ్, అదుపులోకి తీసుకొని విచారించగా ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసిన 19 తులాల బంగారంకీ గాను , 5 తులాల బంగారం,3 సెల్ ఫోన్లో, 28000 నగదును రికవరీ చేసి, నిందితులను రిమాండ్ పంపినట్లుగా డిఎస్పి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలొ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్, టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్, ప్రవీణ్ ,రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

 

Views: 233
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్