పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం

On
పాలకుర్తిలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ మెమో జారీ

జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా

పాలకుర్తి మండలంలో ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ముగ్గురు అధికారులకు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మెమొలు జారీ చేయడం చర్చంశనీమైంది. ఈనెల 6న (బుధవారం) రోజున జిల్లా కలెక్టర్ పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇంటింటి కుటుంబ సర్వే పై పరిశీలనకు వచ్చారు. పాలకుర్తిలో ముగ్గురు పై కలెక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కారణంతో పాలకుర్తి ఎంపీడీవో ఆవుల రాములు, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, పాలకుర్తి పంచాయతీ కార్యదర్శి కె వెంకటేశ్వరచారి కి మెమో జారీ చేశారు. కలెక్టర్ జారీ చేసిన మెమోకు గురువారం రోజున వారు సంజాయిషీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.IMG-20241101-WA0218

Views: 81
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News