రాజధాని బస్సును ప్రారంభించిన కూనంనేని
కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం
On
కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) నవంబర్ 16: కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాజధాని బస్సును కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ రాజధాని బస్సు ప్రతిరోజు ఉదయం 10:30కు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ మియాపూర్ బయలుదేరుతుందని , త్వరలో మరి ఒక బస్సులు కూడా అందుబాటులోకి రానున్నట్లుగా డిఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబిర్ పాషా, సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీను, వాసిరెడ్డి మురళి, భాస్కర్, దుర్గారాశి వెంకన్న, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 121
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Jul 2025 20:20:26
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
Comment List