నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

On
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

ఖమ్మం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి భూక్య ప్రవీణ్ సింగ్ ఆదేశాల మేరకు అకౌంట్స్ మరియు ప్రోగ్రాం అధికారి కమర్తపు భానుచందర్ ప్రోత్సాహంతో, కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ బి మురళీకృష్ణ, ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం కొత్తగూడెం పాల్వంచలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి రాజ్యాంగం గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించి, ఆయన లాగా అందరూ గొప్ప విద్యావంతులుగా ఎదగాలని విద్యార్థులకు తెలియజేసి, వ్యాసరచన పోటీలు నిర్వహించగా, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చి, అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల బృందం ప్రిన్సిపాల్ బద్రు మరియు అధ్యాపకులు, అధ్యాపకురాలు, పువ్వాడ అనగా జాగృతి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్, ధరావత్ ఉపేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యజమానియానికి కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ వారు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 6
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News