జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
On
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా ప్రజలలో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెల్లల క్ష్మీనారాయణ,
ఉపాధ్యాయులు మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఉపేందర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క గొప్పతనం, బాధ్యత గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమం విద్యార్థులలో సమాజ సేవా స్పూర్తిని కలిగించి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ప్రేరణనిచ్చింది.
Read More అన్ని వసతులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు..
Views: 12
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jan 2026 17:35:40
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

Comment List