భద్రాద్రిలో ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం

కొత్తగూడెం పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ 

On
భద్రాద్రిలో ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జనవరి 25: భద్రాద్రి కొత్తగూడెంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం  ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలో విద్యార్థులతో  భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన సమావేశనికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు బాధ్యతగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ జరిపించారు. కుల మత జాతి లింగ విభక్ష లేకుండా భారత రాజ్యాంగం అందించిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. వివిధ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ ఇతర పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధాన చేశారు. ఇప్పటివరకు క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్న  సీనియర్ సిటిజన్స్ ను ఘనంగా శాలువాతో సన్మానించారు. కొంతమంది అధికారులకు కూడా జ్ఞాపికలు అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ , న్యాయమూర్తి భానుమతి, ఆర్డీవో మధు, డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్, క్రీడల శాఖ అధికారి పరంధామ రెడ్డి, ఎమ్మార్వోలు, పుల్లయ్య, ప్రసాద్, కృష్ణ ప్రసాద్, శిరీష ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Views: 20
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..