రామచంద్రభారతిపై మరో కేసు

On

Case Against Ramachandra :ఎమ్మెల్యేలకు ఎర కేసు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన “తెరాస ఎమ్మెల్యేలకు ఎర” కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నాడని.. బంజారాహిల్స్ పోలీసులు రామచంద్ర భారతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు […]

Case Against Ramachandra :ఎమ్మెల్యేలకు ఎర కేసు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన “తెరాస ఎమ్మెల్యేలకు ఎర” కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది.

నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నాడని.. బంజారాహిల్స్ పోలీసులు రామచంద్ర భారతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గత నెల 26న రామచంద్ర భారతితో పాటు మరో ఇద్దరిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8తో పాటు… పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

Read More ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

దిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ ఈ కేసులో కీలక భూమిక పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read More కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి

హైదరాబాద్​కు చెందిన నందకుమార్ సాయంతో పైలెట్ రోహిత్ రెడ్డిని పరిచయం చేసుకొని ఆయన ద్వారా తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీన సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలోనూ రామచంద్ర భారతి మోసాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సుల గురించి ప్రస్తావించారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News