ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్ మాచన రఘునందన్

On
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..

ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్...

ఎల్బీనగర్, ఫిబ్రవరి 04 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- ధూమపానం ప్రాణ హననం కు దారితీస్తుందని, లైటర్ వెలిగించినంత తేలిగ్గా ..స్మోకింగ్ అలవాటు కు కూడా అలా.. "ఫర్ గెట్ ఇట్" అన్నంత తేలిగ్గా స్వస్తి పలుకుతూ..ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఆస్వాదించాలని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహ

IMG-20250203-WA0377(1)
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్ మాచన రఘునందన్..

శిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన ప్రపంచ కాన్సర్ దినోత్సవం దినోత్సవం సందర్భంగా ..స్మోకర్స్ కు పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాల పై అవగాహన కలిగించారు. పొగ తాగడం వ్యసనం గా మారక ముందే ఫుల్ స్టాప్ పెట్టడం మంచిదని సూచించారు.పొగాకు, ధూమపానం అలవాట్లను వ్యసనపరుల చేత మాన్పించడం లో భాగంగా ఐదేళ్ల లో ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఐదు వందల గ్రామాల్లో ..ఎంతో మంది ని పొగాకు, ధూమపానం అలవాట్ల తో కలిగే అనర్థాలను వివరించినట్టు చెప్పారు. యువత సైతం స్నేహం వల్లో, సాంగత్య ప్రభావం వల్లనో స్మోకింగ్ ను అలవాటు చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు.అందుకే కాలేజీ ల కు వెళ్లే విద్యార్థుల పై తల్లి దండ్రులు ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు.సరదా గా మొదలయ్యే అలవాటు వల్ల జీవితం అవాంఛనీయ ఘటనల కు దారి తీయటం వాంఛనీయం కాదని అన్నారు.వజ్ర తుల్య ధృఢ సంకల్పంతో సిగరెట్ తాగడం ,బీడీ కాల్చడం మానేయాలని హితవు చెప్పారు. దమ్ము కొట్ఠాలి ఆన్న కోరిక బలంగా ఉన్నపుడు ఆ ఆలోచన ను వేరే వైపు మరల్చడం ద్వారా లేదా మంచి నీళ్ళు తాగండం చేయాలన్నారు.యోగా చేయడం,ఏదైనా ఇతర పనుల పై దృష్టి పెట్టడం ద్వారా కూడా దమ్ము కొట్టాలి ఆన్న ఆలోచన ను క్రమ,క్రమంగా దూరం చేస్తూ..అధ్బుత ఫలితాన్ని సాధించవచ్చు అని రఘునందన్ చెప్పారు.

Read More తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...

Views: 13

About The Author

Post Comment

Comment List

Latest News

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్