మర్రి"తో "మాచన" అనుభందం...

On
మర్రి

"మర్రి"తో "మాచన" అనుభందం 

"మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం..

రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా ఇటీవల హైదరాబాద్ నుంచి బదిలీ పై నల్లగొండ కు వచ్చిన మాచన రఘునందన్ మర్రిగూడ, నాంపల్లి తదితర ప్రాంతాల భాధ్యత లు తీసుకున్నారు. కాగా.. తాజాగా "మాచన" ధాన్యం సేకరణ, సవాళ్లు అనే అంశం పై నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఎంపికయ్యారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో 3 రోజుల పాటు జరిగిన శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ శనివారం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 11 న మర్రి గూడ లో విధి నిర్వహణలో ఉండగానే, తనకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో శిక్షణ కు ఎంపిక చేసినట్టు సమాచారం అందడo యాదృచ్చికమే ఐనా మర్రి గూడ నుంచి "మర్రి" కి వెళ్ళడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనీ "మాచన" అభిప్రాయ పడ్డారు. ఎన్నో ఏళ్లుగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో జరిగే శిక్షణ కు ఎంపిక కావాలని ఆకాంక్షించినప్పటికీ ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని రఘునందన్ అత్మ సంతృప్తి ని వ్యక్తం చేశారు. అఖిల భారత స్థాయి అధికారుల కు శిక్షణ ఇచ్చే ఉత్కృష్ట సంస్థ ఐన "మర్రి" లో శిక్షణ పొందడం వల్ల విధి నిర్వహణలో నైపుణ్యం మెరుగవ్వడం తో పాటు ఆలోచన ధోరణి లో కూడా ఉన్నతి,పరిణతి ఒనగూరుతాయని రఘునందన్ ఆశా భావం వ్యక్తం చేశారు.

IMG-20250215-WA0406
మర్రి"తో "మాచన" అనుభందం ...
Views: 35

About The Author

Post Comment

Comment List

Latest News

ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస.. ఎల్బీనగర్, జులై 10, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?
🔴 "APK" ఫైళ్ల నుండి జాగ్రత్త!"
'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు.