పెద్దకడుబూరులో "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమం నిర్వహణ..!

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలకు భవిష్యత్తుని ఇవ్వడమే ప్రధాన లక్ష్యమని ప్రతిజ్ఞ చేశారు.

On
పెద్దకడుబూరులో

కార్యక్రమంలో మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి నరవ రామాకాంత్ రెడ్డి లు పాల్గొన్నారు.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం మార్చి15 :-  ప్రతి నెలలో ప్రతి మూడవ శనివారం మన ఆంధ్రప్రదేశ్ లో జరిగే "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమం నిర్వహించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేశాల మేరకు రాష్ట్ర మంతట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఇందులో భాగంగా శనివారం మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామ పంచాయతీలో "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సర్పంచ్ మాల రామాంజినేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి నరవ రామాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలిసి టీడీపీ నేతలు చీపుర పట్టి పరిసరాల పరుశుభ్రతకు నాంది పలికారు. ఆ తరవాత ముఖ్య అతిధులు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించి బావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇది అందరి బాధ్యత అంటూ గుర్తు చేశారు. అలాగే పరిసరాల పరిశుభ్రత పై గ్రామ పంచాయతీలోని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ కవర్లు వాడకం తగ్గించాలని, ప్రతి ఒక్కరూ అవసరాల నిమిత్తం బట్ట సంచులను ఎక్కువ గా ఉపయోగించాలని, పలువురికి బట్ట సంచులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దకడుబూరు మండలం ఎంపిడిఓ నాగరాజు స్వామి, ఈఓఆర్డి జయరాముడు మరియు మండలంలోని పలువురు అధికారులు టీడీపీ మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, దిద్దికాటి మల్లికార్జున, నల్లమల విజయ్, కోడిగుడ్ల యేసేబు, ఆశీర్వాదం, నరసన్న, మీసేవ ఆంజినయ్య, తలారి అంజి, మొట్రూ రామాంజినేయులు, మొట్రూ నరసింహులు,వెంకటేష్ మరియు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...IMG-20250316-WA0030

Views: 32
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News