సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు ఆయన పట్ల దుర్భాషలు..
ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్.. స్పందించిన బస్సు భవన్ అధికారులు..

అంతర్జాతీయ అవార్డు గ్రహీత పట్ల బస్ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు..
సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు ఆయన పట్ల దుర్భాషలు..
ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్.. స్పందించిన బస్సు భవన్ అధికారులు..
క్షమాపణలు చెప్పిన అధికారులు... డ్రైవర్ పై చర్యలకు

ఆదేశం...
రంగారెడ్డి జిల్లా, మార్చి 20, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత పౌరసరపరాల శాఖ ఎన్పోస్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మచన రఘునందన్ కు ఆర్టీసీ బస్సులో చేదు అనుభవం ఎదురయింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ కు సిగరెట్ తాగొద్దని సూచించడంతో ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం వద్ద చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఎంజీబీఎస్ నుంచి మార్కాపురం వెళ్తున్న హైదరాబాద్ డిపో - 1కు చెందిన ఆర్టీసీ బస్సులో ఇబ్రహీంపట్నం వద్ద రఘునందన్ ఎక్కారు. కొద్ది దూరం వెళ్ళినా అనంతరం డ్రైవర్ సిగరెట్ తాగడానికి గమనించి, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. దీంతో డ్రైవర్ ఆయన పట్ల దుర్భాషలాడారు. ఈ ఉదంతాన్ని వివరిస్తూ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ఎక్స్ ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ డిపో, బస్సు భవానికి పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన బస్సు భవన్ అధికారులు ఆయనకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడంతో పాటు డ్రైవర్ పై యాక్షన్ తీసుకోవాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List